ఆర్టీఏ లో పాపాల కథ…?

ఆర్టీఏ లో ఆ “పాపా”లరాయుడు ఆడింది ఆట పాడింది పాటగా చలామణి అవుతుందట…ఎంత పెద్ద అధికారి ఐయినా గత దశాబ్ద కాలంగా ఆయనే ఈ శాఖలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులకు సైతం శాసించే వాడంటే అర్థం చేసుకోవచ్చు అతడు ఏ మేరకు గత ప్రభుత్వం లో తన ఇష్టారాజ్యాని కొనసాగించాడో….

ఆయన కరుణిస్తేనే అంతా….

ఆర్టీఏ లో డిటిసి గా కొనసాగుతున్న ఈ “పాపా”ల రాయుడు రవాణశాఖలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికైనా సరే ఏదైనా పని కావాలన్న ఇట్టే చేసిపెడతాడట… ఆయన తలుసుకుంటే ఆ శాఖలో పని కాకుండా అసలే ఉండదట….అందుకే రవాణాశాఖలో పైరవీకి డబ్బులు పోయిన ఇతగాడిని అందరూ దేవుడిలాగా చూస్తారట…అంతే కాదు ఈ శాఖలో మరీ విచిత్రం ఏంటంటే చాలామంది ఉద్యోగులు, అధికారులు సైతం పాపాలరాయుడితో కలిసి దిగిన ఫోటో ను తమ వాట్సాప్ డీ పి గా పెట్టుకుంటున్నారంటే ఇతగాడి ప్రభావం తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖలో ఏవిదంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు….గత ప్రభుత్వ పెద్దల సామాజికవర్గం ఈ అధికారికి బాగానే కలిసొచ్చిందట… గత ప్రభుత్వంలో పెద్దలుగా కొనసాగిన వారి సామాజికవర్గం ఈ అధికారి సామాజికవర్గం ఒకటే కావడంతో ఆ ప్రభుత్వ పెద్దలకు దగ్గరయిన ఈ అధికారి అలియాస్ పాపాలరాయుడు శాఖలో మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవడం అంతలా ఎలా సాధ్యం ఐయ్యిందో కొత్త సర్కార్ కాస్త దృష్టి సారిస్తే బయటపడుతుంది….

అక్రమ ప్రమోషన్…అందలం
రవాణాశాఖలో డిటిసి గా కొనసాగుతున్న ఈ పాపాలరాయుడు అక్రమంగా అడ్డదారిన ప్రమోషన్ పొంది అందలం ఎక్కినట్లు తెలుస్తుంది….గత ప్రభుత్వ పెద్దలతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా ఓ జీవో తెచ్చి ఆ జీవో ద్వారా ప్రమోషన్ తాను పొందడమే కాకుండా తనకు దగ్గరగా ఉండే మరో ఇద్దరు అధికారులకు సైతం ఈ పాపాలరాయుడు అక్రమ ప్రమోషన్ ఇప్పించినట్లు తెలుస్తుంది….ఒకటి కాదు రెండు కాదు తనకంటే ముందున్న 40 మంది సీనియర్లను కాదని ప్రమోషన్ ఇతగాడు దక్కించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం ఆ జీవో కాపీ కూడ ఇంటర్ నెట్ లో సైతం దొరకకుండా చేయడం పాపాలరాయుడికే సాధ్యం ఐయిందని రవాణాశాఖలో చర్చ జరుగుతోంది…. ఆర్టీఏ అంటేనే తాను …తాను అంటేనే ఆర్టీఏ అంటూ పెత్తనం కొనసాగించే ఈ “పాపాల”రాయుడికి చిరుద్యోగులను పురుగుల్ల చూస్తాడట… ఏ చిన్న కారణం దొరికిన చాలు ఆ ఉద్యోగులపై చిట పట లాడుతాడట గత కొద్ది నెలల క్రితం ఓ చిరుద్యోగిపై చిట పట లాడిన ఇతగాడి చివరకు కాళ్ళు పట్టుకుంటే తప్ప వదలలేదట…

నెల మామూళ్లు…కోటి పైనే…?

రాష్ట్ర రవాణా శాఖలో తనకు తోచినట్లు వ్యవహరిస్తూ ఇష్టారీతిన పెత్తనం కొనసాగిస్తున్న “పాపాల”రాయుడికి జీతం కంటే మామూల్లే ఎక్కువని తెలుస్తుంది…ఎక్కువంటే అంతాఇంతా కాదు నెలవారి మామూళ్లు ఈ సారు కు కోటి రూపాయల పైనే ఉంటుందని ఓ టాక్… జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు, చెక్ పోస్ట్ లల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు అధికారులు క్రమం తప్పకుండా నెల నెలా మామూళ్లు చెల్లిస్తున్నట్లు సమాచారం….ఈ మామూళ్లు ఎవరికి అనుమానం రాకుండా రాష్ట్ర రాజధానిలోని హోటల్ లల్లో,పబ్బుల్లో చేతులు మారుతున్నట్లు సమాచారం…ఇలా రవాణాశాఖను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా దండుకుంటున్న పాపాలరాయుడి పట్ల కొత్త సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here