కబ్జా పై కలెక్టర్ సీరియస్

అడవిరంగాపురం లో ప్రభుత్వ భూమి కబ్జా పై ములుగు కలెక్టర్ సీరియస్
రెవెన్యూ అధికారులను నివేదిక కోరిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య
కబ్జా కు పాల్పడిన వారి వివరాలు ,అక్రమ పట్టాల వివరాలు పంపాలని స్థానిక తహశీల్దార్ కు ఆదేశాలు
నివేదిక తయారీలో తలమునకలైన రెవెన్యూ అధికారులు
28 సర్వే నంబర్లో కబ్జా వివరాలను కలెక్టర్ కు అందజేస్తామన్న వెంకటాపురం తహశీల్దార్ కిశోర్ కుమార్

ములుగు జిల్లా వెంకటాపుర్ మండలం అడవి రంగాపురం గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో జిల్లా కలెక్టర్ సీరియస్ ఐయినట్లు తెలిసింది. మంగళవారం ప్రభుత్వభూమి ఫలహారం శీర్షికన న్యూస్10 లో ప్రచురితమైన కథనం జిల్లాలో చర్చకు దారి తీసింది ఈ నేపథ్యంలో అడవిరంగాపురంలో సర్వే నెంబర్28లో 34 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో తనకు సమగ్ర నివేదికను సమర్పించాలని త్వరలో వివరాలు అందించాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఇతరులకు పట్ట ఎలాచేశారు అనే విషయంపై కలెక్టర్ రెవెన్యూ అధికారులను అడిగినట్లు సమాచారం.ఎవరెవరు ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారు వారి వివరాలు కావాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను అడిగినట్లు తెలిసింది.

కబ్జా పై కలెక్టర్ సీరియస్- news10.app

నివేదిక తయారు చేస్తున్న రెవెన్యూ అధికారులు

సర్వే నంబర్ 28 లో 34 ఎకరాల భూమి కబ్జా విషయంలో నివేదిక తయారు చేసే పనిలో రెవెన్యూ అధికారులు తలమునకలయ్యారు. కబ్జా ఎలా జరిగింది… అక్రమంగా ప్రభుత్వ భూమి ఇతరులకు పట్టా ఎలా ఐయింది అనే విషయంలో రికార్డులు పరిశీలించి నివేదికను రెవెన్యూ అధికారులు తయారు చేస్తున్నారు. అన్ని వివరాలతో తయారు చేసిన ఈ నివేదికను కలెక్టర్ కు రెవెన్యూ అధికారులు సమర్పించనున్నారు.

అధికారులపై చర్యలుంటాయ…?

వెంకటాపురం మండలం అడవి రంగాపురం గ్రామంలో 28 సర్వే నంబర్లో 34 ఎకరాల భూమి అక్రమంగా కబ్జా అయిన విషయంలో అధికారులపై చర్యలు ఉంటాయా.. అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ 34 ఎకరాలలో కొంతమంది నాయకులు రెవెన్యూ అధికారుల అండతో తమపేరుపై పట్టా చేసుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా కబ్జా లో ఉంటూ భూమిని అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరికి అక్రమంగా పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఐయితే ఉన్నతాధికారులు ఆదిశగా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.