సీపీ సార్ ఇదేంది….?

వరంగల్ కమిషనరేట్ లో పి ఆర్ ఓ మోహనకృష్ణ ఇష్టారాజ్యం కొనసాగుతుంది…ఆయనగారు అనుమతిస్తేనే సీపీ ప్రెస్ మీట్ లకు హాజరు కావాలి….అనుమతి లేకుండా హాజరు ఐయారో అవమానానికిగురై బయటకు రావాల్సిందే….కొన్ని ఏళ్లుగా యూనిపామ్ సర్వీస్ ను పూర్తిగా పక్కన పెట్టి పి ఆర్ ఓ కొలువు పేరుతో ఇక్కడ తిష్ట వేసిన పి ఆర్ ఓ పోలీస్ కమిషనరేట్ లో ఓ సరికొత్త రూల్ కు తెరతీశారు… ఇతగాడికేదో సర్కార్ నుంచి ,పోలీస్ ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు ఉన్నట్లు అక్రిడిటేషన్ ఉంటేనే సి పి ప్రెస్ మీట్ కు హాజరుకావాలని హుకుం జారిచేస్తున్నాడు….పోలీస్ కమిషనరేట్ అతగాడి సొత్తు ఐనట్లు అక్రిడేషన్ లేకుండా జర్నలిస్టు లు సీపీ ప్రెస్ మీట్ కు హాజరు కావడానికి వీలు లేదని తక్షణమే కమిషనరేట్ నుంచి వెళ్లి పోవాలని ఈ పోలీస్ పి ఆర్ ఓ దొర గారు ప్రెస్ మీట్ కోసం వెళ్లిన ఓ ఇద్దరు ప్రింట్ డిజిటల్ మీడియా ప్రతినిధులను కొట్టినంత పని చేసాడు….వీరిలో న్యూస్10 ప్రతినిధి సైతం ఉన్నాడు…పదవతరగతి హిందీ పేపర్ లీకేజ్ విషయంలో పోలీస్ కమిషనరేట్ ప్రెస్ మీట్ కు హాజరయిన ఈ ప్రతినిధులను ఏ పేపర్ …అక్రిడిటేషన్ ఉందా …?అని ప్రశ్నించిన పి ఆర్ ఓ మోహనకృష్ణ లేదు అని సమాధానం చెప్పగానే అగ్గిమీదగుగ్గిలం ఐయాడట అక్రిడేషన్ లేకుంటే బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తంచేశాడట…. ఇదెక్కడి రూల్ అని ప్రశ్నిస్తే దాడి చేస్తాడేమోనని భయపడిన ఆ ఇద్దరు జర్నలిస్ట్ లు చేసేదేమిలేక గమ్మున బయటకు వచ్చారట….ఈ పి ఆర్ ఓ అతి తెలివితో ఆనుసరిస్తున్న విధానాలవల్లే గత మూడు సంవత్సరాలుగా న్యూస్10 ప్రతినిధులు ఎవరు కనిషనరేట్ లోని ఏ ప్రెస్ మీట్ కు హాజరు కావడం లేదు….కాని అసలే పోలీస్ బాస్ ప్రెస్ మీట్ పెడితే రాయకుండా ఉంటారా ….?భయపడి వారే రాస్తారు ఏంకాదు …అనే ధోరణిలో పి ఆర్ ఓ కామెంట్లు చేస్తున్నట్లు తెలిసింది…. రాచరికం లో ఉన్నట్లు ఈయన గారు కమిషనరేట్ పరిధిలో జర్నలిజాన్ని శాసిస్తున్నట్లు మాట్లాడుతూ తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడు…

గతంలో అనేక ఆరోపణలు….?


సిపి పి ఆర్ ఓ పై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి…కమిషనర్ టూర్ విషయాలను,పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలను తనకు నచ్చిన పోలీస్ అధికారులకు ముందే లీక్ చేసి లీక్ వీరుడిగా ప్రసిద్ధిగాంచినట్లు ఆరోపణలు ఉన్నాయి…అంతేకాదు పోలీస్ అధికారులను ఏ మాత్రం మర్యాద లేకుండా అన్న, తమ్మి అంటూ సంబోదిస్తూ తానే పోలీస్ ఉన్నతాధికారి గా పోజులు కొడతాడని ఆరోపణలు సైతం గతంలో వచ్చాయి…ఇతగాడి ప్రవర్తనపై గతంలో కొంతమంది సిఐ స్థాయి అధికారులు అప్పట్లో సీపీ కి సైతం పిర్యాదు చేసినట్లు తెలిసింది…ఇంత జరిగినా కూడా పోలీస్ ఉన్నతాధికారులు ఈ ఫోటో గ్రాఫర్ కం పి ఆర్ ఓ ను ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కాని విషయం….
ప్రజల తరపున వకాల్తా …
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను విడచి సాము చేస్తే ఏదీ నడవదనేది స్పష్టం…. ప్రజలకు సేవకులుగా ఉన్న ఏ ఉన్నత స్థానం లో ఉన్న ఎవరైనా దిగి రావాల్సిందే ..పోలీస్ పి ఆర్ ఓ గా కొనసాగుతున్న నన్ను ఎవరు ప్రశ్నించరు అని ఇష్టారీతిన వ్యవహరిస్తున్న పి ఆర్ ఓ అక్రిడిటేషన్ లేకుండా సి పి ప్రెస్ మీట్ కు హాజరు కావద్దనే రూల్ ఎక్కడిదో స్పష్టం చేయాలి….అది ఏ సర్కార్ జీవో లో ఉందో బహిర్గతం చేయాలి….ఎవరి ఆదేశాలతో జరలిస్టులను అవమానిస్తున్నాడో … ప్రెస్ మీట్ కు హాజరు కావద్దనే అధికారం ,పెత్తనం ఆయనకు ఎవరు కట్టబెట్టారో చెప్పాలి…. అసలు అక్రిడిటేషన్ అంటే ఏంటి…అది ఎందుకు పనికి వస్తుందో ఘనత వహించిన పి ఆర్ ఓ కు ఉన్న అవగాహనను బయట పెట్టాలి….. ప్రధాన పత్రిక గా చెప్పుకొనే ఓ పత్రిక యాజమాన్యం సర్కార్ తాయిలం తమకొద్దని కొన్ని సంవత్సరాల పాటు అక్రిడిటేషన్ లు నిరాకరించింది….ఆ సమయంలో ఈ గొప్ప పి ఆర్ ఓ ఉన్నారో లేదో ఈ విషయం తెలుసో లేదో తెలియదు కాని…అక్రిడిటేషన్ లు లేకున్నా వారు అన్ని కవరేజ్ లకు హాజరు ఐయారు. అక్రిడిటేషన్ ల పట్ల ఏమాత్రం అవగాహన లేని ఈ పి ఆర్ ఓ తనకు నచ్చిన ఓ పిడికెడు మంది జర్నలిస్టు లకు అతి మర్యాద ఇస్తూ ఇక మిగతా జర్నలిస్ట్ లు ఎందుకు పనికిరారనే పనికి రాని భావనలో ఉన్న పి ఆర్ ఓ ను పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే ఆ విదులనుంచి తప్పించి అతని పోస్టింగ్ ఎక్కడ ఉందో అక్కడికి పంపించాలని డిమాండ్ ఉన్న పోలిస్ అధికారులు ఆ దిశగా దృష్టిసారించడం లేదనే విమర్శలు ఉన్నాయి….ఏదిఏమైనా ఈ పోలీస్ పి ఆర్ ఓ విషయంలో సీపీ సార్ ఎలా వ్యవహారిస్తారో చూడాలి…అతడి నిర్ణయాన్ని సమర్థిస్తారా …లేక అక్రిడిటేషన్ విధానం సరికాదని మందలిస్తారా…?చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here