బిగ్ బ్రేకింగ్… కేసీఆర్ పై మావోయిస్టుల గరం

ప్రశ్న పత్రాల లీకేజీలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసిఆర్, కేటిఆర్ లను భాద్యులు చేస్తూ వారిని శిక్షించాలని విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ప్రజా స్వామిక వాదులంతా ఐక్యమై ఉద్యమించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు… తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు… ఈ మేరకు మీడియాకు జగన్ ఓ సుదీర్ఘ లేఖను విడుదల చేసారు….

ఇవి లేఖలో విషయాలు యధాతధంగా….

తెలంగాణంలో పరీక్ష పేపర్ లీకుల వరస ఘటనలు నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో గందర గోళాన్ని సృష్టిస్తున్యాయి. కార్పొరేట్ విద్య సంస్థల కొమ్ముకాస్తున్న కేసిఆర్ వారి ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మొన్న టీఎస్పీఎస్సీ గ్రూపు-1ఫ్రిలిమ్స్ పేపర్స్ లీకు, నిన్న పదోవ తరగతి తెలుగు పరీక్ష పేపర్ లీకు, నేడు హింది పరీక్ష పేపర్ లీకు, ఊట్నూర్లో పదోవ తరగతి జవాబ్ పత్రాలు మాయం ఇలా రోజుకొక్కటి చొప్పున లీకులు జరుగుతున్న పట్టించుకోకుండా నిరుద్యోగుల, విద్యార్థుల భవిష్యత్తు ను గాలికి వదిలేస్తున్నారు.గ్రూపు-1ప్రిలిమ్స్ సహా మొత్తం ఆరు పరీక్షలకు సంబధించిన 15 ప్రశ్న పత్రాలు లీక్ అయిన విషయాన్ని సిట్ తన విచారణలో తేల్చి చెప్పింది. ఇంతా భారీ స్థాయిలో ప్రశ్న పత్రాల లీకేజీ, పదోవ తరగతి ప్రశ్న పత్రాలు వరుసగా లీక్ అవుతుండడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యేశ పూర్వకంగా బాద్యత రాహిత్యం, అలసత్వాని ప్రదర్శిస్తుంది. తెలంగాణ రాష్ట్రం తగల బడినా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. కేసిఆర్ పాలన పరమైన విషయాలను పక్కన బెట్టి ప్రధాని కావాలనే పగటి కలలు కంటూ ప్రజల ప్రగతిని మర్చి ప్రగతి భవనంలో పార్టీ రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నాడు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే నిరుద్యోగ సమస్య తీరుతుందని ప్రత్యేక రాష్ట్రం కోసం తెగించి పోరాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు ప్రాణ త్యాగం చేశారు. అనేక మందిపై కేసులు బనాయించబడి జైలుకెళ్ళారు. లాఠీ చార్జీలకు, తూటాల దెబ్బలకు గాయాల పాలయ్యారు. ప్రజల విరోచిత పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ అయితే ఏర్పడింది కాని నీళ్ళు, నిధులు, నియమాకాలు మనకే దక్కుతాయనుకున్న ప్రజలకు తీరని అకాంక్షే మిగిలింది. తెలంగాణ వచ్చాకా నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందే కాని తగ్గలేదు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నా భర్తీ చేయడం లేదు కాని ఎన్నికల గడువు దగ్గర పడుతున్న నేపధ్యంలో 80 వేల ఉద్యోగాలు ఇస్తామని కేసిఆర్ మోస పూరిత ప్రకటన చేశారు. ఇప్పటికి 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటించకుండా ఓట్ల ప్రయోజనాల కోసం నాన్చుతూ కాలం గడుపుతున్నారు. ప్రభుత్వం కొన్ని పోస్టులను బదిలీలు, ప్రమోషన్ల పేరుతో ఉద్యోగ భర్తీలను దాట వేస్తుంది.2022లో ఉపాధ్యాయ నియమాకాల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించారు. ఈ అర్హత పరీక్షలో నాలుగు లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరంతా టీఆర్టి నొటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ఎనిమిది నెలలు గడిచిన ప్రభుత్వం వాటి ఊసు ఎత్తడం లేదు. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు కూడా గురుకుల పాఠశాల టీచర్ల నొటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.అదేవిధంగా విఆర్ ఓ పోస్టులను రద్దు చేయాలని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సంకల్పించింది. వీఆర్ ఓ లను ఇతర శాఖలోకి పంపించి రెవిన్యూ శాఖలోని ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని చూస్తుంది. ఇది పూర్తి అన్యాయమైన చర్య. వీఆర్ ఓ లను రద్దు చేయడం అనేది రాజ్యంగ విరుద్ధం.బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరెట్ విద్య సంస్థల అనుకూల విధానాలను అమలులో భాగంగానే ప్రభుత్వ రంగ విద్య సంస్థలను నిరక్ష్యం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. గ్రూపు-1 ప్రిలిమ్ పరీక్ష ప్రశ్న పత్రాలు, పదవ తరగతి తెలుగు ప్రశ్న పత్రం లీక్ కావడం, హిందీ ప్రశ్న పత్రాలు లీకు కావాడం పరీక్ష రాసిన జవాబు పత్రాల బండిల్స్ పోవడం అనే వరుస సంఘటనలు ప్రభుత్వ రంగ విద్యాలయాలపై బీఆర్ఎస్ ప్రభుత్వానికున్న చిత్తశుద్ది ఏపాటిదో అర్ధమవుతుంది. టీఎస్పీఎస్సీ, నిర్వహించిన గ్రూపు-1 ప్రశ్న పత్రాలు లీక్ సంబంధించి ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించడం మూలంగా ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి అనేది వాస్తవమే అయినప్పటికీ ఇందులో ముఖ్య మంత్రి కార్యాలయం పాత్ర కూడా వుంది. ఈ ప్రభత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల మూలంగా నిరుద్యోగులు, విద్యార్థులు గందరగోళంలో, అభద్రత భావంలో జీవిస్తున్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలతో ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు లీకేజీ వ్యవహారం నిరాశ, నిస్పృహాలకు దారితీసింది. తెలంగాణ సమాజాన్నే గందరగోళ పరుస్తున్న ఈ ఘటనలపై ప్రభుత్వం యొక్క కనీస జవాబుదారీ తనం లేదు. ప్రశ్న పత్రాలు లీక్ అవడం అనేది సాధారణమైందే అంటూ నిర్లజ్జగా ప్రకటించుకున్నారు. లీకేజీలకు కారకులైన వారిని శిక్షించకుండా మళ్ళీ వారితోనే పరీక్షలు నిర్వహిస్తాననడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. లీకేజీ కేసులో సిట్ విచారణ చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు 15 మంది అరెస్టు చేసి విచారిస్తుంది.. కొద్ది మంది అధికారులను విచారించి
వదిలేస్తుంది. సిట్ చేపట్టిన ఈ తతంగమంతా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వుంది. లీకు చేసిన అసలైన దోషులను వదిలేసి చిన్న, చిన్న నిందితులను మాత్రమే అరెస్టు చేసింది. కేటిఆర్ పీఎ ద్వారానే లీకు అయ్యాయని, కేసిఆర్ కార్యాలయం పాత్ర వుందని ఆరోపణలున్నప్పటికి వారిని కనీసం టచ్ కూడా చేయడం లేదు.
లక్షలాది నిరుద్యోగులు,విద్యార్థులు మంచి భవిష్యత్ను ఊహించుకొని ఉద్యోగాల పోటిలో ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని వున్నా లక్షల రుపాయాలు ఖర్చు చేపి యునివర్శిటీలలో, లైబ్రరీలలో, కోచింగ్ పెంటర్లలో కష్టబడి చదువుకొని పరిక్షలకు ప్రిపేర్ అయి వస్తే ప్రభత్వం చేస్తున్న నిర్వహాకం వల్ల విద్యార్థుల జీవితాలు నాశనమయి పోతున్నాయి.

పిలుపు

నిరుద్యోగులారా, విద్యార్థులారా!

తెలంగాణ ఏర్పడినప్పటికి మనకు ఇంక ప్రజా స్వామ్యం రాలేదు. ఎనో ఆశలు పెట్టుకున్న నీళ్ళు, నిధులు, నియమాకాలు మనకు దక్కడం లేదు. అందుకే ప్రజా స్వామిక ప్రత్యేక తెలంగాణ సాధించుకునే కల ఇంకా మిగిలే వుంది. ప్రజా స్వామిక ప్రత్యేక తెలంగాణ కొరకై ఉద్యమించండి. నీళ్ళు, నిధులు, నియమకాలు దక్కే వరకు పోరాడండి. నిరుద్యోగ సమస్యను పోరాటాల ద్వారా పరిష్కరిచుంకొండి. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరెట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి.పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి అసలైన దోషులను కఠినంగా శిక్షించే వరకు పోరాడండి.
అదేవిధంగా టీఎస్పీఎస్సీ పరీక్షల లీకేజీకి కారకులైన అధికారులను తొలగించి వారిపై తగిన చర్యలు చేపట్టాలి. నూతన బోర్డును ఏర్పర్చాలి. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీలు చేపట్టాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here