విద్యార్థి డిబార్ ను రద్దు చేయండి…మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్

ప్రశ్నపత్రాల లీక్ లో ఐదు సంవత్సరాల పాటు డిబార్ చేసిన విద్యార్థి డిబార్ ను వెంటనే రద్దు చేయాలని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖలో డిమాండ్ చేశారు…ప్రశ్నపత్రాల లికేజ్ విషయంలో మరోసారి మీడియాకు లేఖ విడుదల చేసిన ఆయన లికేజ్ విషయంలో బండి సంజయ్,కేసీఆర్ లను ముందుగా శిక్షించాలన్నారు….బీజేపి, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ లబ్ధి కోసం విదార్థులను బలి పశువును చేస్తున్నారని, పేద మైనర్ విద్యార్థులను అడ్డం పెట్టుకొని ప్రశ్న పత్రాల లీకులకు పాల్పతున్నారు.

అమాయక విద్యార్థులను బెదిరించి వారి వద్ద నుండి బలవంతంగా ప్రశ్న పత్రాలను లాక్కొని వారి జీవితాన్నే నాశనం చేశారని జగన్ లేఖలో ఆరోపించారు… నీచ రాజకీయాల కోసం ప్రశ్న పత్రాలను లీక్ చేసినా అసలు సూత్ర దారులు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసిఆర్లను శిక్షించకుండా అమాయక విద్యార్థిని 5 సంవత్సరాలు డిబార్ చేసి భవిష్యత్ ను చిద్రం చేస్తున్నారని అన్నారు… విద్యార్థి డిబారన్ను రద్దు చేసి సీఎం కేసిఆర్, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లను వెంటనే శిక్షించాలన్నారు..అధికారం కోసం విద్యార్థులను బలి పశువులు చేసే రాజకీయ నాయకులను శిక్షించే వరకు విద్యార్థులు, వారి తల్లి దండ్రులంతా ఐక్యమై పోరాడాలనిజగన్ పిలుపునిచ్చారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here