షుటింగ్‌లో గాయపడ్డ అఖిల్‌ అక్కినేని

యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. కాగా ఈ సినిమా షూటింగ్ లో అఖిల్ గాయపడ్డారని తెలుస్తుంది. ఒక ఫైట్ చిత్రీకరణలో ప్రమాదవశాత్తు అఖిల్ చేతికి తీవ్ర గాయమైందని సమాచారం . దాంతో షూటింగ్ ను నిలిపివేశారు. అఖిల్ తిరిగి కోలుకునేంతవరకు షూటింగ్ వాయిదా వేసింది చిత్రయూనిట్.