అమాత్యుడికి తమ్ముడి తలనొప్పి…?

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కి వరంగల్ తూర్పులో తమ్ముడి రాజకీయ వ్యవహారం తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడం అయిష్టంగానే ఉన్న అన్నకిచ్చిన మాట ప్రకారం పోటినుంచి తప్పుకున్న తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇప్పుడు ఎంచేస్తాడోనని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కు అప్పుడే గుబులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.. దింతో రానున్న ఎన్నికల్లో తూర్పులో మంత్రికి బ్రదర్ స్ట్రోక్ తప్పేలా లేదని తెలుస్తుంది.

రానున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి తూర్పు నియోజకవర్గంలో టికెట్ రాకుంటే తమ్ముడి నిర్ణయం ఏవిదంగా ఉంటుందని ఇక్కడ అప్పుడే చర్చ మొదలయ్యింది.. గత ఎన్నికల్లోనే కోపంగా పోటినుంచి తప్పుకున్న మంత్రి తమ్ముడు ఈసారి తప్పకుండా టికెట్ ఆశిస్తాడని అందుకు క్షేత్ర స్థాయిలో నియోజకవర్గంలోని వివిధ డివిజన్ లల్లో వివిధ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నాడు ఈ నేపథ్యంలో తీరా సమయానికి టికెట్ రాదంటే మంత్రి సోదరుడి నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో ప్రశ్నగా మారింది. మరోవైపు తూర్పు నియోజకవర్గంలో తనదైన శైలిలో మార్క్ ఉండేలా ప్రయత్నం చేస్తూ అధిష్టానానికి సైతం కొంతమేర దగ్గరగా ఉంటాడని పేరున్న ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కాదని టికెట్ వేరే వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదని గులాబీ వర్గాల్లో ప్రచారం జయుగుతుంది..

అమాత్యుడికి తమ్ముడి తలనొప్పి...?- news10.app

ఈ క్రమంలో మంత్రి తమ్ముడి ఆలోచన ఏంటని ఆయన అనుచరుల్లో సైతం ఆసక్తి కలుగుతుందట. తమ నాయకుడు గత ఎన్నికల్లోనే వచ్చే ఎన్నికల్లో మాట వినేది లేదని మంత్రికి చెప్పాడని అలాంటప్పుడు పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని వారు అంటున్నారు దింతో రానున్న ఎన్నికల్లో తూర్పు గులాబీ లో టికెట్ రగడ బాగానే ఉంటుందని అర్థం అవుతుంది.

కమలం వైపు ఆడుగులు….?

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీలో టికెట్ కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రయత్నాలు విఫలం అవుతాయని అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం… టికెట్ రానప్పుడు గులాబీలో కొనసాగడం ఎందుకని తన అడుగులు కమలం వైపు వేస్తున్నట్లు తెలుస్తుంది… వరంగల్ తూర్పులో కమలంలో టికెట్ కోసం పోటీ అంత ఎక్కువగా లేనందున బీజేపీ లో చేరితే టికెట్ దక్కించుకోవడం చాలా సులువని మంత్రి సోదరుడు భావిస్తున్నట్లు తెలిసింది… ఐయితే అన్న గులాబీ పార్టీలో ఉంటూ మంత్రిగా కొనసాగుతుండగా తాను కమలం తీర్టం పుచ్చుకుంటే ఎలా అనే ఆలోచన ఉన్న రాజకీయ భవిష్యత్ కోసం తప్పదని కాషాయ తీర్టం పుచ్చుకొనేందుకే సిద్ధం ఐయినట్లే తెలుస్తుంది… మొత్తానికి మంత్రి సోదరుడు ఇలా కమలం వైపు మొగ్గు చూపితే మంత్రికి భారీ జట్కా ఇచినట్లేనని ఇప్పటికే వరంగల్ గులాబీలో చర్చ మొదలయ్యింది… ఇంకా ముందు ముందు తూర్పు గులాబీలో ఎం జరగనుండో వేచిచూడాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here