ఆ సిఐ కి వెటకారాలు ఎక్కువ…

గుండెలో బాధను దిగ మింగుకొని పోలీసుల ద్వారా తనకు న్యాయం జరుగుతుందని గత నెల రోజులకు పైగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న మహిళకు చుక్కలు చూపెడుతున్నాడట హన్మకొండ సుబేదారి సిఐ… న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మహిళకు ఇక్కడ ప్రేండ్లీ పోలీసింగ్ ఉండదు బాధతో వస్తే వెటకారంతో మరింత బాధకు గురిచేయడం తప్ప తమకేం తెలియదు అన్నట్లు ప్రవర్తించాడట ఆ సిఐ… తనతో సహజీవనం అంటూ మోసం చేసి లక్షల రూపాయలు కాజేసిన సహజీవన మోసగాడు డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు తనతో కలిసి ఉన్నపుడు తనకు తెలియకుండా రహస్యంగా తీసిన న్యూడ్ ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఇంటర్ నెట్ లో పెట్టి అందరికి తెలిసేలా చేస్తానని బెదిరిస్తున్నాడని తన గోడు వెళ్లబోసుకొని…. ఒక మహిళగా తన నగ్న ఫోటోలు తానే సిగ్గు విడిచి న్యాయం చేయమని సిఐ కి ఆ మోసగాడు తనకు వాట్సాప్ ద్వారా సాంపిల్ మాత్రమే అంటూ పంపిన నగ్న ఫోటోలు చూపించిన సదరు సిఐ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాడట… న్యాయం చేస్తారేమోనని …తనను మోసం చేసిన మోసగాడిపై కేసు నమోదు చేస్తారేమోనని నిన్నటివరకు పోలీసులపై ఎంతో నమ్మకంగా ఉన్న భాదిత మహిళ సిఐ వేటకారపు మాటలతో భాదపడుతూ న్యూస్10 తో తన బాధనంత వెళ్లబోసుకుంది… కేసు పెట్టకుండా సిఐ తనను ఎలా మాటలతో బాధ పెట్టాడో చెపుతూ కన్నీటి పర్యంతమయింది…

ఆ సిఐ కి వెటకారాలు ఎక్కువ...- news10.app

స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు…

తనకు న్యాయం చేయమని హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ చుట్టూ గత నెలరోజులుగా తిరుగుతున్న ఆ మహిళకు ఎలాంటి న్యాయం దక్కడం లేదు. పిటిషన్ అందజేసిన వెంటనే పిటిషన్ ఇచ్చినట్లు కనీసం రశీదు కూడా ఇవ్వకుండా తన డెస్క్ లో వేసుకున్న సిఐ… బాధతో వెళ్లిన మహిళను పది రోజుల తర్వాత కల్వమని పంపించేసాడు… పది రోజుల తర్వాత సార్ ఏమైంది అని మహిళ మళ్ళీ స్టేషన్ వెలితే బిజీగా ఉన్న ఇప్పుడు కుదరదు మళ్ళీ వారం రోజులకు రండి అంటూ పంపించేసాడు…కానీ న్యాయం చేసే ప్రయత్నం మాత్రం అ సిఐ చేయడం లేదని మహిళ ఆరోపిస్తోంది…ఇప్పటికి తాను ఇచ్చిన పిటీషన్ సిఐ డెస్క్ లోనే మూలుగుతుందట.

లేడి కానిస్టేబుల్ తో చెక్ చేపిస్తా…

తన న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ తనను మానసిక వేదనకు గురి చేస్తు… ఇంటర్ నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని సాంపిల్ అంటూ తన న్యూడ్ ఫోటోలు తనకే వాట్సాప్ లో పంపాడని ఆ ఫోటోలు చూపిస్తే చూసిన సిఐ ఆ న్యూడ్ ఫోటోలు తనవి కావని అంటున్నాడని…అవి తనవో కావో తేల్చడానికి లేడి కానిస్టేబుల్ చెక్ చేయిస్తానని అంటున్నాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది… ఆ న్యూడ్ ఫోటోలు తనవేనని తాను చెప్పిన నమ్మని సిఐ ఎలా చెక్ చేస్తాడని ఆమె ప్రశ్నించింది…. ఒక మహిళతో సిఐ మాట్లాడే పద్ధతేన…? ఆవేదన చెందింది.

ఒక్కదానివే రా…..!

తనకు న్యాయం చేయాలని మోసం చేసి తన నగ్న ఫొటోలు తనకే పంపి బెదిరిస్తున్న సహజీవన మోసగాడిపై కేసు నమోదు చేయాలని సుబేదారి సిఐ ని బ్రతిమిలాడితే తనను ఒక్కదానినే రావాలని అంటున్నాడని… ఒంటరిగా వస్తే తాను పిర్యాదు చేసిన వారిని పిలిచి మాట్లాడతానని అంటున్నాడని ఇందులో ఆంతర్యం ఏంటో ఆ సిఐ కే తెలియాలని మహిళ అంటోంది. తనను మోసం చేసిన అతనితో సిఐ కుమ్మక్కు అయి ఉంటాడని మహిళ అనుమానం వ్యక్తం చేస్తుంది… పోలీసులు తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యం అంటూ బోరున విలపించింది….

( సిఐ సార్……
చేతులు కాలాక ఆకులు పట్టుకుందామా….?
రేపటి సంచికలో…..)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here