కమిషనర్ సార్ చర్యలేవి….?

హన్మకొండ జిల్లా పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రం లో జరిగిన అవినీతి లో హన్మకొండ పిఏసీఎస్ సి ఈ ఓ జాన్ దామోదర్ వజ్రకవచ మిల్లు యజమాని జైలు పాలయ్యారు. ఈ స్కామ్ కు పౌర సరఫరాల హన్మకొండ జిల్లా మేనేజర్ కృష్ణవేణి పూర్తి స్థాయిలో తన సహాయ సహకారాలు అందించినట్లు అధికారుల విచారణలో వెల్లడయినట్లు తెలుస్తుంది… కానీ ఇప్పటివరకు ఉన్నతాధికారులు ఈ అధికారిణి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు … అయితే ఈ కేసులో తనపై చర్యలు ఉంటాయని గమనించిన సదరు అధికారి చర్యల నుండి తప్పించుకోవడానికి లాంగ్ లీవ్ పెట్టగా ఉన్నతాధికారులు ఆమె లీవ్ ను తిరస్కరించారని సమాచారం. ఉన్నతాధికారులు ఆమె కోరిన సెలవులను తిరస్కరించడంతో ఆ అధికారిపై వేటు పడుతుందని హన్మకొండ జిల్లా పౌరసరఫరాల ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.. స్కామ్ జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ అధికారి పై సివిల్ సప్లై కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వీరి మధ్య అవగాహన రావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది . అవినీతికి పాల్పడిన సి ఈ ఓ ను,వజ్రకవచ మిల్లు యజమాని ని జైలుకు పంపిన అధికారులు స్కామ్ కు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా మేనేజర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని రైతులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు…

కమిషనర్ సార్ చర్యలేవి....?- news10.app

జైలు పాలైన సి ఈ ఓ , మిల్లు యజమాని

హన్మకొండ పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రం లో జరిగిన కోటి రూపాయల స్కామ్ లో పిఏసీఎస్ సి ఈ ఓ జాన్ దామోదర్, వజ్ర కవచ మిల్లు యజమాని కుమార్ అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ఉన్నతాధికారులు వారిరువుని 10 రోజుల క్రితమే జైలు కు పంపించారు

జిల్లా మేనేజర్ కనుసన్నల్లోనే ఈ స్కామ్?

పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవినీతి జరిగిందని అధికారుల విచారణలో వెల్లడైంది ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రతి అంశం జిల్లా మేనేజర్ కనుసన్నల్లోనే జరుగుతుందని అలాంటిది కోటి రూపాయల స్కామ్ ఈ అధికారికి తెలియకుండానే జరిగిందా? కొనుగోళ్లే లేనప్పుడు ఆ సెంటర్ కు 13 వేల గన్ని బ్యాగులు జిల్లా మేనేజర్ ఎందుకు పంపించారని కొనుగోళ్లే జరగనప్పుడు ధాన్యం రవాణా చార్జీలు కాంట్రాక్టర్ ఎందుకు చెల్లించారు అంటే ఈ అధికారికి కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

తప్పించుకునే ప్రయత్నo లో అధికారి

పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అవినీతి లో పిఏసీఎస్ సి ఈ ఓ, వజ్రకవచ మిల్లు యజమాని జైలు పాలవ్వడంతో వీరిరువురికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌరసరఫరాల జిల్లా మేనేజర్ స్కామ్ నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సీఈఓ, మిల్లు యజమాని పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో తనపై వేటు తప్పదని భావించిన జిల్లా మేనేజర్ లాంగ్ లీవ్ పెట్టి చర్యల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారట కానీ ఉన్నతాధికారులు ఆమె కోరిన సెలవులను తిరస్కరించినట్లు సమాచారం

కమిషనర్ సార్ ఆ అధికారి పై చర్యలెప్పుడు?

హన్మకొండ జిల్లా పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రంలో కోటి రూపాయలకు పైగా స్కామ్ జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా అవినీతికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా మేనేజర్ కృష్ణవేణి పై కమిషనర్ చర్యలకు వెనకాడుతున్నారట.అదే స్కామ్ లో మిల్లు యజమాని ని, పిఏసీఎస్ సీఈఓ ను జైలుకు పంపిన అధికారులు వారికి సహకరించిన జిల్లా మేనేజర్ పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని జిల్లా రైతులు సివిల్ సప్లై కమిషనర్ ను ప్రశ్నిస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here