జీడబ్ల్యూ ఎం సి లో అవినీతి తిమింగలం…..?

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఆయనో పెద్దసారు….పెద్దసారు అంటే అలాంటి ఇలాంటి పెద్దసారు కాదు…పరిచయాలు మెండుగా ఉండి ఉన్నతాధికారులకే ఫోన్ లు చేయించి మావాడే కాస్త చూసి చూడనట్లు ఉండండి… అని చెప్పించగల సమర్థుడన్న మాట…. అవినీతిలో ఆరితేరిన ఈ సారు చేసిన అవినీతిని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి నోళ్ళకు ఎలా తాళం వేయాలో అనే విద్య బాగా తెలిసిన బహు నేర్పరి అన్నమాట… అసలు అతగాడి శాఖ అధికారులు ఎక్కడో పోస్టింగ్ ఇస్తే దాన్ని కాదని తన స్థాయిలో చక్రం తిప్పి ప్రస్తుతం బల్దియాలో స్థిరపడి పోయి… అన్ని విభాగాల్లో దూరి రెండు చేతుల సంపాదిస్తూ నన్ను అనేవారు ఎవరు లేరు అంటూ ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నాడట… మొన్నటికి మొన్న ట్రేడ్ లైసెన్స్ ల కుంభకోణం బయటకు వచ్చిన సారు గారు మాత్రం దర్జాగా జి డబ్ల్యు ఎం సి లొనే ఉంటూ ఉన్నతాధికారులకు సవాల్ విసిరే స్థాయికి చేరాడట… ఉన్నతాధికారులు ఇక మీ సేవలు చాలు మాతృ సంస్థ దారి పట్టండి అని చెప్పిన ససేమిరా అంటూ కదిలేది లేదు అంటున్నాడట… దింతో అధికారులు సైతం ట్రేడ్ లైసెన్స్ ల వ్యవహారం తేలేదాక కదల నిచ్చేది లేదని అంటున్నారట…ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకు ట్రేడ్ లైసెన్స్ ల కుంభకోణంలో ఈ సారు మూడు కోట్లు మేసినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిందట… లేని వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్ లు ఇచ్చి బాగానే దండుకున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి సైతం వచ్చిందట… ఈ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని ఈ స్కామ్ లో సహకరించిన ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని బల్దియాలో ఉద్యోగం నుంచి తొలగించి తానే మళ్ళీ వేరేచోట కొలువు పెట్టించినట్లు వరంగల్ కార్పొరేషన్ లో చర్చ జరుగుతుంది.ఇలా అక్రమ ట్రేడ్ లైసెన్స్ లు జారీ చేసి తన చేతివాటాన్ని ఉపయోగించిన ఈ ఈ పెద్ద సారు బల్దియాలో తాను వేలు పెట్టని వ్యవహారమే లేదంటే అతిశేయోక్తే కాదట…

జీడబ్ల్యూ ఎం సి లో అవినీతి తిమింగలం.....?- news10.app

వసూళ్లకు ఆ నలుగురు…..?

బల్దియాలో తన ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న ఈ పెద్ద సారు వసూళ్ల బాధ్యత ఓ నలుగురికి అప్పగించాడట… బల్దియాలో పనిచేస్తున్న ఈ నలుగురు నెల నెలా మామూళ్లు వసూల్ చేసి ఆ సారుకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తారని తెలిసింది.. అంతేకాదు బల్దియాలో రోజు వాడే డీజిల్ విషయంలో సైతం ఈ సారు తనకు తోచినకాడికి అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిసింది… వాహనాలు పని చేయకున్న డీజిల్ వాడినట్లు లెక్కలు చూపుతున్నట్లు సమాచారం.ఇలా వాహనదారులకు లబ్ది చేకూర్చినందుకు గాను డీజిల్ ఇంచార్జ్ వద్దనుంచి నెలనెలా అక్షరాల ఓ లక్షరూపాయలు నొక్కుతున్నట్లు తెలియవచ్చింది. ఫాగింగ్ ఆటోల విషయంలో సైతం మామూళ్ల దందానే సారు కొనసాగిస్తూ న్నాడట…జి డబ్ల్యు ఎం సి లో ఇప్పటికి నాలుగు ఫాగింగ్ ఆటోలు ఉండగా అవి పనిచేసిన చేయకున్న ఒక్కో ఆటో నుంచి నెలకు నలభై వేల రూపాయలు ముట్టాల్సిందేనట ….ఇంతేకాదు బల్దియాలో పనిచేస్తున్న సానిటరీ ఇన్స్పెక్టర్ లను సైతం ఈ పెద్ద సారు వదలలేదట… నెల వారిగా వీరి వద్దనుంచి బాగానే దండుకుంటున్నాడట.నెలనెలా ఠంచనుగా డబ్బులు ముట్టజెప్పాల్సిందేనని వారికి హుకుం సైతం జారిచేసాడట. ఈ పెద్ద సారు ఇంతటితో ఆగకుండా అవినీతి సంపాదనను మరింత రెట్టింపు చేసుకునేందుకు ఇక్కడి ఉద్యోగి పేరుతో ట్రాక్టర్ లు కొనుగోలు చేసి వాటిని కార్పొరేషన్ లో అద్దెకు ఉంచినట్లు తెలిసింది… ఆ కాట్రాక్ట్ ఉద్యోగి పేరు బయటపడితే చాలు సారు వారి బండారం మొత్తం బయటపడుతుందట.నెల వారిగా కేవలం మామూళ్ల రూపంలో లక్షల రూపాయలు దండుకుంటున్న ఈ పెద్ద సారు బల్దియాలో ఓ అవినీతి తిమింగలం లాగా మారినట్లు తెలుస్తుంది…ఇదేంటని ప్రశ్నిస్తే మాత్రం సత్య హరిచంద్రునిల మాటలు చెప్పే ఇతగాడు అవినీతి మాత్రం కామాలే తప్ప పులిస్టాప్ ఏమాత్రం పెట్టడం లేదట….ఇంతగా లక్షల రూపాయలు వెనకేస్తున్న ఈ అవినీతి తిమింగలం తన సతీమణి కుటుంబ సభ్యుల పేర భారీగానే ఆస్తులు కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here