ఒత్తిళ్లకు తలొగ్గలేదు… అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు….

గ్రేటర్ వరంగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గలేదు… ఎట్టకేలకు అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించారు… అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా…సర్కార్ నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించిన ఉక్కుపాదం మోపుతామని సందేశం ఇచ్చారు. అనుమతులు ఒకలా నిర్మాణం మరోలా ఉంటే చర్యలు తప్పవని భవన యజమానులకు హెచ్చరికలు జారీచేశారు… గ్రేటర్ వరంగల్ లోని అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. గత 40 రోజులుగా కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై న్యూస్-10 అక్షర సమరం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కథనాలపై స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి లేని కట్టడాలను కూల్చివేస్తున్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుష్మ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసారు .బిజీగా ఉండే ప్రాంతాల్లో ప్రదానరహదారులనే ఆనుకొని నిబంధనలు ఉల్లఘించి హన్మకొండ అదాలత్ సెంటర్ ప్రాంతంలో గ్రీన్ పార్క్ హోటల్ పక్కన నిర్మాణం అవుతున్న నిర్మాణం పై టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెర్ర చేశారు…. గత కొద్ది రోజుల క్రితం ఈ అక్రమ నిర్మాణం పై న్యూస్10 పలు కథనాలు వెలువరించింది… ఏమాత్రం సెట్ బ్యాక్ లేకుండా,అదనపు అంతస్తులకు అనుమతి లేకుండా నిర్మాణం కొనసాగుతుందని న్యూస్10 తన కథనం ద్వారా విషయాన్ని టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది… ఈ నేపథ్యంలో బిల్డింగ్ యజమానికి అధికారులు నోటీసులు జారీ చేసిన ఎలాంటి మార్పు లేకపోవడంతో బుధవారం అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి సుష్మ నేతృత్వంలో హన్మకొండ సుబేదారి లోని గ్రీన్ పార్క్ హోటల్ చోటి మసీదు పక్కనే నిర్మించిన ఈ అక్రమ భవనాన్ని పోలీస్, డి ఆర్ ఎఫ్ సిబ్బంది తో కలిసి కూల్చివేసారు .అనుమతిలేని రెండు అంతస్తులను తొలగించివేశారు…

ఒత్తిళ్లకు తలొగ్గలేదు... అక్రమ కట్టడాలు కూల్చేస్తున్నారు....- news10.app

రాజకీయ ఒత్తిళ్లు…?

గ్రేటర్ వరంగల్ నగరం లో అనుమతులు లేకుండా,నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం అవుతున్న అక్రమ నిర్మాణాల తరుపున కొంతమంది రాజకీయ నాయకులు వాకాల్తా పుచ్చుకుంటున్నట్లు తెలిసింది..మనవాళ్లదే వదిలేయండి… ఆ నిర్మాణం జోలికి వెళ్ళకండి అంటూ టౌన్ ప్లానింగ్ అధికారులకు కొంతమంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు హుకుం జారిచేస్తున్నట్లు తెలిసింది… దింతో కొన్ని సందర్భాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు వెనుకడుగు వేసిన … న్యూస్10 వరస కథనాలకు స్పందించి అక్రమనిర్మాణాలపై చర్యలు తీసుకోవడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా పనిచేస్తున్న కొంతమంది అధికారులకు ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారిచేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here