ఎంజీఎం ఆ సర్జికల్స్ సొంతమా…?

ఉత్తర తెలంగాణలో పెద్దాసుపత్రిగా పేరుగాంచిన ఎంజియంలో కాంట్రాక్ట్ ల రాజ్యం నడుస్తుంది… ఇక్కడ ఒక్కసారి టెండర్ దక్కిందా చాలు ఏళ్ల తరబడి తిష్ట వేసి ఇక్కడే ఉంటున్నారు కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు. ఇక్కడ పాతుకుపోయిన కాంట్రాక్టర్ లది ఆడింది ఆట పాడింది పాట ల తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాదు ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది అధికారులు కాంట్రాక్టర్ లకు సహకరిస్తూ ఒక్కసారి టెండర్ దక్కితే చాలు కాంట్రాక్ట్ కాలపరిమితి ముగిసిన అలాగే కొనసాగిస్తూ టెండర్ లు ఆహ్వానించకుండానే పాత వారినే కొనసాగిస్తున్నట్లు విమర్శలు బాగానే వస్తున్నాయి… ఇలా కొనసాగించడానికి కొంతమంది వైద్యులు కాంట్రాక్టర్ లకు తమ సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా ఇలాగే ఆర్తో విభాగంలో ఇష్టారాజ్యం నడుస్తున్నట్లు తెలుస్తుంది. గత 20 ఏళ్లుగా ఓ సర్జికల్స్ సంస్థ ఎలాంటి టెండర్ లేకుండా కొనసాగుతున్నట్లు సమాచారం.ఇందుకు గాను ఆసుపత్రి లోని కొంతమంది వైద్యులే సహకారం అందిస్తున్నట్లు తెలిసింది.

ఎంజీఎం ఆ సర్జికల్స్ సొంతమా...?- news10.app

20 సంవత్సరాలుగా ఆ సంస్థే…?

వరంగల్ ఉమ్మడి జిల్లా కు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం లో గత ఇరవై సంవత్సరాలుగా ఇంప్లాంట్స్ టెండర్ ఒకే సంస్థకు కేటాయించడం అనేక అనుమానాలకు తావిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లాంట్స్ సప్లై చేయడానికి అనేక సంస్థలు ఉన్నప్పటికీ వారికి అవకాశం దక్కకుండా ఎలాంటి టెండర్ లు పిలువకుండా 20 సంవత్సరాల నుండి కేవలం ఆ సంస్థకే ఇంప్లాంట్స్ కాంట్రాక్ట్ ను అధికారులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది…. ఇరవై ఏళ్లుగా ఇక్కడి ఆర్థో విభాగంలో ఇంప్లాంట్స్ సరఫరా చేస్తున్న ఈ సంస్థ తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది వైద్యులతో మాట్లాడుకుని మోకాళ్ళ చిప్ప మార్పిడి తదితర ఆపరేషన్ లకు సంబందించిన ఇంప్లాంట్స్ కోసం వైద్యులు రెఫర్ చేస్తే మార్కెట్ రేట్ కంటే వేల రూపాయలు అదనంగా తీసుకుంటూ రోగుల జేబులు ఖాళీ చేస్తున్నట్లు తెలుస్తోంది… ఈ దోపిడిలో కొంతమంది డాక్టర్ల కు కమీషన్ రూపంలో భాగం పంచుతున్నట్లు తెలిసింది.

ఆ సర్జికల్స్ సప్లై చేస్తున్న ఇంప్లాంట్స్ లో నాణ్యత ఉందా?

ఉమ్మడి జిల్లాలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఏదైనా ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినప్పుడు ఎక్కువ శాతం ఎంజీఎం ఆసుపత్రికే వస్తారు… ఇక్కడే సర్జరీ చేపించుకుంటారు అయితే సర్జరీల్లో వాడే ఇంప్లాంట్స్ నాణ్యమైనవా…? కాదా…? అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న . ఇరవై ఏళ్లుగా ఇక్కడే అపాతుకుపోయిన ఈ ఇంప్లాంట్స్ సప్లై చేసే సంస్థ నాణ్యత లేని ఇంప్లాంట్స్ ను అందిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది… ఇక్కడ ఆర్థో విభాగంలో సర్జరీ చేయించుకున్న చాలామంది పేదలు నాణ్యత లేని నాసిరకం ఇంప్లాంట్స్ మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిసింది… ఐయితే ఇక్కడ ఇంప్లాంట్స్ అమర్చడం వల్లే ఇలా జరిగిందని తెలియక వైద్యం సరిగా అందలేదని కొంతమంది ఇప్పటికి కొన్ని సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు విశ్వసనీయసమాచారం..

ఆ సంస్థకే టెండర్ దక్కేలా చూస్తుంది ఎవరు?

ఎంజీఎం లో ఆర్థో విభాగం చాలా కీలకం… ఎముకలు విరిగిన వారికి ఆర్థోపెడిక్ డాక్టర్లు ఇంప్లాంట్స్ అమర్చి సర్జరీలు చేస్తారు. ఇంప్లాంట్స్ సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తారు. కాంట్రాక్ట్ గడువు ముగియగానే టెండర్ లు పిలువాలి కానీ అలాజరగడం లేదు. టెండర్ లు పిలువకపోవడంతో గత 20 సంవత్సరాలుగా ఆ సర్జికల్ సంస్థకే టెండర్ దక్కేలా కొంతమంది డాక్టర్లు చక్రం తిప్పుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here