పట్టింపు వద్దా…?

ధాన్యం కొనుగోలు కేంద్రం ఉండదు… అసలు కొనుగోళ్లే జరగవు కానీ కోటి రూపాయల ధనం మింగేస్తారు… మిల్లర్ నుంచి మొదలుపెడితే జిల్లా స్థాయి అధికారి వరకు అందరూ ఈ అవినీతిలో భాగస్వాములు ఐయినట్లు ఆరోపణలు వస్తాయి… విజిలెన్స్ విచారణ నుంచి మొదలుపెడితే శాఖ పరమైన విచారణ వరకు అవినీతి నిజమేనని తేలింది.. అందుకు సంబంధించిన నివేదికను సైతం ఉన్నతాధికారులనుచి, కలెక్టర్ వరకు విచారణ అధికారులు అందజేశారు.. దింతో మిల్లు యజమాని, సీవిల్ సప్లైఈస్ సి ఈ ఓ పై చర్యలు తీసుకున్నారు… కానీ ఈ కోటి రూపాయల స్కామ్ లో సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌర సరఫరాల శాఖ హన్మకొండ జిల్లా మేనేజర్ పై మాత్రం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు… ఈ చర్యల అంశం జిల్లా కలెక్టర్ పరిదిలోనిదని సివిల్ సప్లై అధికారులు చెపుతున్నారు… కానీ ఇక్కడి కలెక్టర్ మాత్రం ఇద్దరిపై చర్యలకు ఆదేశించగా జిల్లా మేనేజర్ ను మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు…పలివేల్పుల ధాన్యం స్కామ్ లో ఈ అధికారి సహకారం లేనిది అసలు ఏమాత్రం అవినీతి జరగడానికి ఛాన్స్ లేదన్న విషయాన్ని తెలిసి కూడా కలెక్టర్ చర్యలకు వెనుకాడుతున్నట్లు తెలుస్తుంది..ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్న ఇంతటి అవినీతి జరుగుతున్న ఉమ్మడిజిల్లా మంత్రులు ఇటువైపుగా ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదు…. పారదర్శకత,అవినీతి రహిత పాలన అని చెప్పే మంత్రులు ఇంతటి స్కామ్ జరుగుతున్న ఎందుకు గమ్మున ఉంటున్నారో వారికే అర్థం కావాలి.సమీక్షలు సమావేశాలతో అధికారులతో నిత్యం టచ్ లో ఉండే మంత్రులు ఈ అవినీతి విషయంలో చర్యలు తీసుకోవాలని ఎందుకు ఆదేశించడం లేదో అర్థం కావడం లేదు.దింతో అవినీతి జరిగిన ఆ శాఖ ఉద్యోగులే మంత్రులు కనీసం పట్టించుకోవడం లేదని చర్చించుకుంటున్నారు… జిల్లా కలెక్టర్ ఇద్దరి పై చర్యలు తీసుకోగా అసలు అవినీతికి కారణం ఐయిన హన్మకొండ సివిల్ సప్లై మేనేజర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

పట్టింపు వద్దా...?- news10.app

మేనేజర్ కు మినహాయింపా?

పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రంలో కోటి రూపాయల అవినీతి జరిగిందని హన్మకొండ పిఏసీఎస్ సీఈఓ ను, వజ్రకవచ మిల్లు యజమాని ని జైలు కు పంపిన జిల్లా కలెక్టర్ ఆ స్కామ్ సహకరించిన పౌరసరఫరాల జిల్లా మేనేజర్ కృష్ణవేణి పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యమేమిటో అని జిల్లా రైతులు, కలెక్టరేట్ ఉద్యోగులు బహిరంగంగానే కలెక్టర్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం.ఇప్పటికైనా కలెక్టర్ స్కామ్ కు సహకరించిన జిల్లా మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు

ఉమ్మడి జిల్లా మంత్రులు ఏంచేస్తున్నట్లు?

హన్మకొండ జిల్లాలోని పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు లేకుండానే పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సహకారంతో 1 కోటి రూపాయల స్కామ్ జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికి జిల్లా మేనేజర్ పై చర్యలు తీసుకోలేదు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం సేకరణ లో ఈ స్థాయిలో అది హన్మకొండ జిల్లాలో అవినీతి జరిగినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు ఇప్పటివరకు స్పందించకపోవడం పలివేల్పుల స్కామ్ పై చర్యలు తీసుకోకపోవడం వల్ల జిల్లా రైతులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసి కోటి రూపాయల ప్రభుత్వ సొమ్ము కాజేయటానికి సహకరించిన పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పై చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్న మంత్రులు ఇద్దరూ ఇప్పటికయినా మేనేజర్ కృష్ణవేణి పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు

అవినీతి పరులకు సహకరిస్తారా?చర్యలు తీసుకుంటారా?

ఓ వైపు తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి చోటులేదని పదే పదే ప్రెస్ మీట్ లలో చెప్పే మంత్రులలో ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముందు వరుసలో ఉంటారు మరి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న హన్మకొండ జిల్లాలో అది ధాన్యం కొనుగోళ్లలో కోటి రూపాయల అవినీతి జరిగిన ఈ ఇద్దరు మంత్రులు స్పందించకపోవడం విడ్డూరం .ఇప్పటికైనా మంత్రులు ఈ అవినీతిని సీరియస్ గా తీసుకొని జిల్లా మేనేజర్ కృష్ణవేణి పై చర్యలు తీసుకుంటారో ….ఆ అధికారికే సహకరిస్తారో అనేది తేలాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here