డ్రోన్ వార్…

ముమ్మాటికీ డ్రోన్ దాడే… సాక్ష్యలివిగో…..

ఛత్తీస్ గడ్ లో ప్రస్తుతం పోలీస్ వర్సెస్ మావోయిస్టుల యుద్ధం నడుస్తున్నట్లు ఉంది… దండకారణ్యంలో పోలీసులు డ్రోన్ దాడులు చేస్తున్నారని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ అధికారప్రతినిది బుధవారం ఫోటోలు , వీడియోలు సాక్ష్యాధారాలతో సహా లేఖ విడుదల చేసారు… ఎప్పుడు లేనంతగా దండకారణ్యంలో డ్రోన్ దాడులు చేస్తూ ప్రజలపై యుద్దానికి తెర తీసారంటూ వికల్ప్ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొత్స లంక, పాల గూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో.. పోలీస్ లు ఏప్రిల్ 19 తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో 12 బాంబులను డ్రోన్ సహాయంతో అటవీ ప్రాంతంలో వదిలారని… ఈ విషయాన్ని దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ పత్రిక ప్రకటన ద్వారా స్ఫష్టం చేశారు.. దానికి సంబంధించిన ఫొటోస్.. వీడియోస్ మీడియాకు విడుదల చేశారు.

పోలీసులు మావోయిస్టుల మీద గగనతలం నుండి బాంబులు వెయ్యడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నెల 19న ఉదయం మూడు గంటలకు బొత్తలంక పాలగూడెం గ్రామ పరిసరాల్లో డ్రోన్ల ద్వారా ప్రభుత్వం చేసిన దాడులను ఖండించండి అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ స్పష్టం చేశారు. దండకారణ్య భూభాగం మీద ఆకాశం నుండి దాడులు చేయడంతో ఫాఫిస్టు మోడీ, అమిత్ షా కంపెనీ.. మరింత టెర్రరిస్టులగా తయ్యారయారు అంటూ ఆయన మండిపడ్డారు. నెంబర్ వన్ దేశ ద్రోహులుగా సామాజ్రవాద ఏజెంట్లుగా ప్రజల ముందు బహిర్గతం అయ్యారని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దాడులను ఖండిస్తూన్నాం అని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా ఈనెల 26న భారత్ బంద్ కొనసాగుతోంది అని స్పష్టం చేశారు. ఆదివాసీ సంఘాలు వివిధ పార్టీలు,ప్రజాస్వామిక సంఘాలు, పౌరహక్కులు, కార్మికులు రైతాంగం, విద్యార్థులు, మేధావులు ,దళితులు, ఆపరేషన్ ప్రహర్… డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి అని పిలుపు …. ఇది ఇలా ఉంటే అధికారప్రతినిది వికల్ప్ ఆరోపణలను దక్షణ బస్తర్ ఐజీ సుందర రాజ్ ఖండించారు. ఆధారం లేని ఆరోపణలు అంటూ ఖండించారు. దింతో మావోయిస్టులు ఐజి ఖండించడాన్ని తప్పుబడుతూ గురువారం మరో లేఖ విడుదల చేసారు… డ్రోన్ దాడులకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలను విడుదలచేసారు.

ముమ్మాటికీ డ్రోన్ దాడులే…

ఛత్తీస్గఢ్ లో పోలీసులు ముమ్మాటికీ డ్రోన్ దాడులు చేయడం నిజమేనని భారత కమ్యూనిస్టు పార్టీ రక్షణ దక్షిణ బ్యూరో పేరిట మావోయిస్టులు మీడియాకు గురువారం లేఖ విడుదల చేశారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం చేసిన డ్రోన్ దాడులను బస్టర్ ఐ జి సుందర్ రాజ్ ఆధారం లేని ఆరోపణలు అనడాన్ని వారు ఖండించారు. మధ్యవర్తులను దాడి జరిగిన ప్రాంతానికి పంపిస్తే అసలు వాస్తవం తెలుస్తుందని వారు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి సలహాదారు విజయ్ కుమార్, ఆపరేషన్స్ డిజిపి అశోక్ ఆపరేషన్లు పథకం ప్రకారమే దాడులు చేశారని లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతానికి విలేకరులు, ప్రజాస్వామికవాదులు వచ్చి పరిశీలించాలని కోరుతున్నామన్నారు.

ఏప్రిల్ 19న పి ఎల్ జి ఎ పడగొట్టిన 2 డ్రోన్లను కూడా మీరు చూడవచ్చని మావోయిస్టులు కూల్చిన డ్రోన్ల ఫోటోలను మీడియాకు విడుదల చేసారు. మొత్తానికి చత్తీస్ గడ్ లో మావోయిస్టులు వర్సెస్ పోలీసుల యుద్ధం మరింత తార స్థాయికి చేరుకుంది… ఒకరిని ఒకరు అడ్డుకునేందుకు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నట్లు కనపడుతుంది… దింతో చత్తీస్ గడ్ లోని దక్షిణ బస్తర్ లో యుద్ధ వాతవరణం నెలకొంది… మరోవైపు దేశంలో ఎప్పుడు లేని విదంగా బస్తర్ లో పోలీసులు మొదటిసారిగా డ్రోన్ దిగడం ఆందోళన కలిగిస్తుంది.