రెచ్చిపోతున్న రియల్టర్లు….

గ్రేటర్ వరంగల్ పరిధిలో రియల్టర్ లు దనార్జనే ద్యేయంగా వెంచర్ లు ఏర్పాటు చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లను విక్రయిస్తూ రెచ్చిపోతున్నట్లు జోరుగా విమర్శలు వినవస్తున్నాయి… వెంచర్ ల ఏర్పాటు విషయంలో సర్కార్ కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసిన ఆ నిబంధనలను ఎంతమాత్రం కాదని అనుమతులు లేకుండా, ఒకవేళ అనుమతులు ఉన్నా పూర్తి నిబంధనలకు వ్యతిరేకంగా వెంచర్ లను ఏర్పాటు చేసి రియల్టర్ తమ రియల్ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ సర్కార్ ఖజానాకు తూట్లు పొడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…ఖాళీ స్థలం కనపడితే చాలు అనుమతులు లేకుండా ,నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయించి రియల్టర్ లు చేతులు దులుపుకుంటున్నట్లు తెలియవచ్చింది. ఇదే తరహాలో హాసన్ పర్తి మండలం ఉనికి చెర్ల లో 22 ఎకరాల్లో భారీ స్థాయిలో వెంచర్ వేశారు రియల్టర్లు.

రెచ్చిపోతున్న రియల్టర్లు....- news10.app

22 ఎకరాల్లో భారీ వెంచర్

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని ఉనికిచెర్ల లో రియల్టర్లు అనుమతి లేకుండా 22 ఎకరాల్లో భారీ వెంచర్ ను ఏర్పాటు చేసారు.ఆ వెంచర్ లో 343 ప్లాట్లు ఏర్పాటు చేశారు .వెంచర్లో ఎలాంటి రోడ్లు లేకుండా చుట్టూ ప్రహరీని కూడా నిర్మించకుండా పూర్తి నిబంధనలకు విరుద్ధంగా లాభార్జనే ధ్యేయంగా వెంచర్ చేసినట్లు తెలుస్తోంది…. ఇలా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఈ వెంచర్ లోని ప్లాట్లను సైతం రియల్టర్లు అప్పుడే అమ్మడం కూడా ప్రారంబించినట్లు తెలుస్తుంది. అనుమతులు లేకుండా పూర్తి నిభందనలకు విరుద్ధంగా ఈ వెంచర్ ఏర్పాటు చేసిన రియల్టర్లు తమకు అన్ని రకాల అండదండలు ఉన్నాయని ఎలాంటి అనుమతులు లేకున్నా వెంచర్ ఏర్పాటు చేశామని తమకు తెలిసిన వారు అన్ని చూసుకుంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

నిబంధనలకు విరుద్ధంగా వెంచర్….?

సాధారణంగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కానీ ,కుడా పరిధిలో కానీ వెంచర్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.అనుమతులు పొందినా కూడా నిబంధనల ప్రకారం వెంచర్ లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం కల్పించి చుట్టూ ప్రహరీ చేయాలి. కానీ ఈ వెంచర్ లో ఇవేమీ కనిపించవు ఈ వెంచర్ పూర్తి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు……. అంతేకాదు ఇంత భారీ స్థాయిలో 22 ఎకరాల స్థలంలో వెంచర్ ఏర్పాటు చేసినపుడు దీనికి సంబంధించిన అనుమతులు రాష్ట్ర రాజధానిలో పొందాల్సిఉంటుంది… ఇక్కడి అధికారులు రియల్టర్ ల వెంచర్ కు సంబంధించి వివరాలను అక్కడి ఉన్నతాధికారులకు పంపితే అక్కడినుంచి అనుమతులు పొందాలంట కానీ రియల్టర్ ఆ ప్రయత్నాలు ఏమాత్రం చేయనట్లు తెలుస్తుంది… కాగా గ్రేటర్ వరంగల్ లాంటి నగరాల్లో ఇంత ఎక్కువమొత్తం ఎకరాల్లో వెంచర్ అనుమతులు ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిసింది కానీ రియల్టర్ లు మాత్రం ఎలాంటి ఆలోచన అక్రమ వెంచర్ అనే భయం లేకుండా వెంచర్ వేసి తమను ఎవరు ఏమంటారో చూద్దాం అన్నట్లు అధికారులకే సవాల్ విసిరిన స్థాయిలో భారీ వెంచర్ వేశారు.

టౌన్ ప్లానింగ్, కుడా అధికారులకు తెలియదా?

హసన్ పర్తి మండలం ఉనికిచెర్ల లో అక్రమంగా 22 ఎకరాల్లో ఇష్టారాజ్యంగా వెంచర్ చేసిన కుడా అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు మరీ ఇంత బహిరంగంగా అక్రమ వెంచర్ చేశారంటే అధికారులను ప్రసన్నం చేసుకొనే రియల్టర్లు వెంచర్ చేసినట్లు ప్రజలు గుససగుసలాడుతున్నారు…. ఇప్పటికైనా ఈ భారీ వెంచర్ వ్యవహారాన్ని ఇక్కడి కుడా ,టౌన్ ప్లానింగ్ అధికారులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారా లేక చూసి చూడనట్లు వ్యవహరిస్తార…? వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here