జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ఓ ద్విచక్ర వాహన షోరూం వద్ద జరిగిన ఘర్షణలో పోలీసుల అతి ప్రవర్తన వల్ల ప్రశాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రశాంత్ మీద గణపురం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ అకారణంగా చేయి చేసుకున్నాడని మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించి వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు ప్రశాంత్ మృతికి కారణమైన ఎస్సై మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. కాగా విచారణ చేపట్టిన అధికారులు ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ మీద చర్యలు తీసుకున్నారు. గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశాంత్ అనే యువకుడి మృతికి కారణమైన ఎస్సై మీద చర్యలు తీసుకున్నారు. నార్త్ జోన్ అదనపు డీజీపీ నాగిరెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై ఉదయ్ కిరణ్ ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.