అక్రమ వెంచర్ ల వీరుడు…

అంతా మోసం , మాయ మాటలు, మార్కెట్ మాయజాలంతో ఆకర్షణీయమైన లే ఔట్ ఫొటోలతో రియల్ వ్యాపారం బాగా చేయొచ్చు అనుకున్నాడు… అనుమతులు లేకున్నా ఉన్నాయని చెప్పి కొనుగోలుదారులను బురిడీ కొట్టించి ప్లాట్లు అమ్ముకునే ప్రయత్నం… ఒకటి కాదు రెండు కాదు అనుమతులు లేకుండా మూడు వెంచర్ లకు శ్రీకారం చుట్టాడు ఓ అక్రమవెంచర్ ల వీరుడు… ఫామ్ ల్యాండ్, గ్రీన్ ల్యాండ్, ఇన్ఫ్రా ఎస్టేట్ పేరు లతో రియల్ దందా మొదలు పెట్టారు… ఈయనకు తోడు ఇక్కడ నడుస్తున్న అక్రమ రియల్ దందాకు ఓ ఇద్దరు తహశీల్దార్ లు సైతం సహకరిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరూ ఈ రియల్టర్ కు అక్రమ రిజిస్ట్రేషన్ లు చేస్తున్నట్లు తెలిసింది…

అక్రమ వెంచర్ ల వీరుడు...- news10.app

నాలా కన్వర్షన్ లేదు డిటీసీపీ అనుమతులు అసలే లేవు

వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో ఓ ఫైనాన్షియర్ చేస్తున్న మూడు వెంచర్ లకు అనుమతులు లేవని తెలిసింది సాధారణంగా వెంచర్ చేయాలంటే వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేసిన తర్వాత మాత్రమే వెంచర్ చేయాలి కానీ ఈ ఫైనాన్షియర్ అవేమి పట్టించుకోకుండానే డిటీసీపీ అనుమతులు తీసుకోకుండానే మూడు వెంచర్ లు చేసినట్లు సమాచారం.

నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు

వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లో ఇటీవల ఓ ఫైనాన్షియర్ మూడు అక్రమ వెంచర్ లను ఏర్పాటు చేశాడు. వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు గా చేసి గజాల్లో కాకుండా 2 గుంటలకో ప్లాటు చొప్పున అమ్మకాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ వెంచర్ లోని ప్లాట్లను వెంచర్ నిర్వాహకులు ఇచ్చే ముడుపులకు ఆశపడి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వర్ధన్నపేట, ఐనవోలు తహసీల్దార్ లు 2 గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేసి పాస్ బుక్ లు జారీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం

డిటీసీపీ అప్రూవల్ అంటూ మోసం

వర్ధన్నపేట మండలం ఉప్పరపెళ్లి క్రాస్ రోడ్ కట్రియాల శివారులో ఈ ఫైనాన్షియర్ చేసిన వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా డిటీసీపీ అప్రూవల్ లే అవుట్ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం పై న్యూస్-10 ప్రతినిధి డిటీసీపీ అధికారులను సంప్రదించగా ఆ వెంచర్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. డిటీసీపీ అనుమతి తీసుకోకుండానే డిటీసీపీ అప్రూవల్ లే అవుట్ అని బోర్డు ఏర్పాటు చేయడం పై డిటీసీపీ అధికారులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here