- హాస్టల్ ఆఫీసులో ఓ ఉన్నతాధికారి
- కేర్ టేకర్ దే ఇష్టారాజ్యం
- ఖాళీ బిల్లులతో లక్షల రూపాయల స్వాహా…
- క్యాష్ రిజిస్టర్లో నమోదు చేయని అధికారులు
- ఎక్కడ దొరికిపోతామో సమాలోచన లో పడ్డ ఉన్నతాధికారి
- హాస్టల్ ఆఫీసులో ఒకటే గుసగుసలు….
కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ విభాగం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది.. తిలా పాపం తలా పిరికెడు అన్న చందంగా ఓ ఉన్నత స్థాయి అధికారి ఓ కేర్ టే కర్ కలిసి యూనివర్సిటీ నిధులను నీళ్ల సౌకర్యాల పేరుతో అప్పనంగా దోచుకుంటున్నారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో యూనివర్సిటీ లో మంచి నీటి సమస్య ఏర్పడింది. వర్సిటీలో ఉన్న ఒక్క వాటర్ ప్లాంటుతో హాస్టళ్లలో తాగు నీటిని అందించడం కష్టంగా మారింది. ధీంతో బయట నుండి నీటిని తెప్పించి నీటి కొరతను అధిగమించాలని యూనివర్సిటీ అధికారులు భావించారు. ఇదే అదునుగా భావించిన హాస్టల్ ఆఫీసులో ని ఓ ఉన్నత స్థాయి అధికారి ఓ కేర్ టేకర్ లు తమ చేతివాటం ప్రదర్శించారు. చింతగట్టు నుండి ఓ వాటర్ ప్లాంట్ పేరుతో ఖాళీ బిల్లులు తెప్పించి అధిక ధరతో వెచ్చించినట్లు బిల్లులు(ఆరు వందల రావాల్సిన ట్యాంకర్ కు రెండు వేలుగా) నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే ఆ వాటర్ ప్లాంటు బిల్లులో ఉన్న అడ్రస్ కి వెళ్ళితే అసలు అక్కడ వాటర్ ప్లాంటే లేదు అనేది ఆశ్చర్యానికి గురిచేసే అంశం.
పడని బోర్ల కు మోటార్ బిల్లులు పెట్టిన అధికారి….?
కేయులో నీటి ఎద్దడిని అధిగమించేందుకు యూనివర్సిటీ అధికారు కొద్దీ రోజుల క్రితం అంబేద్కర్ హాస్టల్ సమీపంలో మూడు బోర్లను వేయించారు. మూడింటిలో ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడంతో అధికారులు తమ శ్రమను వృధా ప్రయత్నం గా భావించారు కానీ సదరు ఉన్నత స్థాయి అధికారి మాత్రం ఈ అవకాశాన్ని అదునుగా భావించి పైపు లైను, నీళ్ల మోటర్ల పేరుతో లక్షకు పైగా బిల్లులను చూపించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరు అధికారులు చేసిన తప్పుడు పనుల గురించి గత రెండు రోజులుగా ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయట ధీంతో సమాలోచనలో పడ్డ ఆ ఉన్నత స్థాయి అధికారి ఆ బిల్లులను క్యాష్ రిజిస్టర్ లో నమోదు చేయకుండా తన బీరువాలో భద్రంగా పెట్టుకున్నట్లు సమాచారం.
వేచి చూడాలి… ఈ అవినీతి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి……!