కబ్జాల్లో ఆరితేరారు….!

కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో కొంతమంది గులాబీ నాయకులు, కబ్జారాయుళ్లు కబ్జాల్లో ఆరితేరిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూమియజమానులకు తెలియకుండానే కబ్జారాయుళ్లు కొందరి భూములను వివాదాల్లోకి లాగి అందులో ఉన్న చిన్న చిన్న లొసుగులు ఆధారంగా చేసుకొని అమాయకుల భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. నగర శివార్లలో భూముల ధరలకు రెక్కలు రావడం ,ఔటర్ రింగ్ రోడ్డు రావడం వల్ల వీటి చుట్టూ ఉన్న కొంతమంది అమాయకుల భూములను అప్పనంగా తమ సొంతం చేసుకునేందుకు గులాబీ నాయకులు, కబ్జారాయుళ్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నగరంతో పాటు నగర శివారు ప్రాంతంలో ఇలా సామాన్యుల భూములు అనేకం ఏ కారణం లేకుండా వివాదాల్లో ఇరుక్కోవడం, కొందరి భూములు కబ్జా రాయుళ్ల వశం కావడం జరిగిందని భాదితులు లబోదిబోమంటున్నారు.

కబ్జాల్లో ఆరితేరారు....!- news10.app

అధికారుల సహకారం….,?

నగరంలో, నగర శివారులో భూములను తమ సొంతం చేసుకోవడానికి ఏవో లొసుగులను ఆధారం చేసుకుని ప్రయత్నం చేస్తున్న వారికి రెవెన్యూ అధికారులు సహకారం అందిస్తున్నారని కొంతమంది భాదితులు ఆరోపిస్తున్నారు… తాము తహశీల్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన కాని పనులు భూములు కాజేయాలని చూస్తున్న నాయకులకు మాత్రం చాలా సులువుగా అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి వారికి ఎలాంటి అధికారిక పత్రాలు లేకున్నా పాస్ బుక్ లు అందిస్తూ అసలు యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు అంటున్నారు… తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకొని వారి వశం చేసుకొని చాలా సులువుగా పాస్ బుక్ లు చేసుకున్న వారి డ్యాక్యుమెంట్స్ ఇవ్వాలని ఆర్ టి ఐ చట్టం ప్రకారం కోరితే రెవెన్యూ అధికారులు సైతం ఎలాంటి సరైన పత్రాలు ఇవ్వడం లేదని అలాంటప్పుడు పాస్ బుక్ లు ఎలా జారీ చేయబడుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు.

హసన్ పర్తి మండలంలో…

హన్మకొండ జిల్లాలో నగరాన్ని ఆనుకొని ఉన్న హసన్ పర్తి మండల వ్యాప్తంగా బూకబ్జాలు,భూ తగాదాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.నగరానికి అతి సమీపంలో ఉండడం , మండలం లోని కొన్ని గ్రామాలు రింగ్ రోడ్డు ను ఆనుకొని ఉండడం వల్ల భూముల ధరలు విపరీతంగా పెరగడంతో కబ్జా రాయుళ్ల కన్ను ఇక్కడి భూములపై పడడంతో సామాన్యులకు ఇక్కడి భూములను కాపాడుకోవడం గగనమైపోయింది… ఇక్కడ పనిచేస్తున్న రెవెన్యూ అధికారిపై కూడా రోజురోజుకు ఆరోపణలు పెరిగిపోతున్నాయి… నాయకులకు ఇక్కడి అధికారి పూర్తిగా సహకరిస్తూ సామాన్యులను విస్మరిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి.కోర్ట్ కేసులు ఉన్న భూములకు సైతం పాస్ బుక్ లు జారిచేస్తున్న ఈ అధికారి ఇదేంటని ప్రశ్నిస్తే కోర్టు తో తమకు సంబంధం లేదని సమాధానం ఇస్తున్నట్లు కొంతమంది భాదితులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారి సైతం కొంతమందికి సహకరిస్తూ భూముల విషయంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న చోద్యం చూస్తున్నారని భాదితులు అంటున్నారు. అనేక భూములు సమస్యల్లో ఉండగా భాదితులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదని వారు చెపుతున్నారు. గులాబీ లీడర్ లు ఈ మండలంలో కబ్జాలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురుచేస్తున్నారని పలుమార్లు విన్నవించినా లాభం లేకుండా పోయిందని వారు అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here