ఇంద్రవెళ్లి పోరాట స్ఫూర్తిని చాటుదాం….!

మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్: మీడియాకు లేఖ విడుదల

ప్రజలంతా ఇంద్రవెళ్లి పోరాట స్ఫూర్తి తో ఉద్యమంలో ముందుకు సాగాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. శుక్రవారం జగన్ మీడియాకు లేఖ విడుదల చేసారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ఈ లేఖలో ఇంద్రవెళ్లి 40 సంవత్సరాల అమరత్వం, ఇంద్ర వెళ్లి పోరాటస్ఫూర్తి, రైతుల ఉద్యమం తదితర అంశాలను లేఖలో పేర్కొన్నారు. 40 ఏళ్ల ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సాహంతో ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ ఈ లేఖలో ప్రజలకు పిలుపునిచ్చింది. ఇంద్రవెల్లి అమరులకు జోహార్లు అంటూ పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలి.

అటవీ భూముల పట్టాలపై పోరాడాలని ఫారెస్ట్ అధికారుల జులుం నశించాలాంటు అధికార ప్రతినిధి జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, కవ్వాల్ టైగర్ జోన్ అభయారణ్యాలు ఎత్తివేయాలని, అడవిని ధ్వంసం చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను ఇనుప గనులను పెద్ద ప్రాజెక్టును రద్దు చేయాలని లేఖలో అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కుట్రలను ఎండగడతామంటూ జగన్ లెఖలో హెచ్చరించారు.