మేఘా సిగలో మరో అస్త్రం

మేకిన్ ఇండియా విధానంలో భాగంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ణానంతో రక్షణ రంగానికి చెందిన యంత్ర సామాగ్రి,ఆయుధాలను తయారు చేసే పనిలో భాగంగా శక్తి సామర్ద్యాలు గల దేశీయ కంపెనీలకు భాగస్వామ్యం కల్పించింది కేంద్రప్రభుత్వం. ఇందులో భాగంగానే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ కు రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పరిశ్రమ స్దాపించేందుకు కేంద్ర వాణిజ్య పారిశ్రామిక శాఖ కు సంబందించిన డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ నుండి అనుమతులు జారీ అయ్యాయి.

రక్షణ రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించుకోవాలనే సంకల్పంతో కేంద్రం తీసుకొచ్చిన మేకిన్ ఇండియా 2020 పాలసీకి అనుగుణంగా ఆర్మీకి అవసరమైన ఆయుధాలు,వాహనాలు,విడి పరికరాలు సాయిధ సంపత్తి ని తయారు చేసేందుకు దేశీయ కంపెనీలను ఆహ్వానించడంతో ఎంఈఐఎల్ ధరఖాస్తు చేసుకుంది. సంస్ద శక్తి సామర్ద్యాలను పరిశీలించిన తరువాత మిలిటరీకి వాహనాలను,ఆయుధాలతో సహా ఉత్పత్తి చేసే విధంగా అనుమతులు జారీచేసింది కేంద్రం.దీంతో 1959 ఆయుధాల చట్టం కింది అనుమతి పొందిన మేఘా త్వరలోనే ఇందుకు సంబందించిన పరిశ్రమను ఐడిఏ-జీడిమెట్లలో ఏర్పాటు చేయనుంది.ఇప్పటికే దేశంలో నిర్మాణ,మౌళిక వసతుల రంగాలతో పాటు చమురు,ఇంధన వాయివు,విద్యుత్,సౌరవిద్యుత్,విమానయాన రంగాలకు విస్తరించిన ఎంఈఐఎల్ తాజాగా దేశ రక్షణకు సంబందించిన పరికరాల ఉత్పత్తి రంగంలో ప్రవేశిస్తోంది. మేఘా సంస్థ దాదాపు 500 కోట్లతో తెలంగాణలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఈ రక్షణ రంగ ఉత్పత్తి పరికరాల సంస్థను ఏర్పాటు చేయబోతోంది.

ఎంఈఐఎల్ ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ లో యుద్ధ ట్యాంకులు వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధవాహనాలు,ఆర్మ్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మ్డ్ రికవరీ వెహికిల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా సైనికులను తీసుకువెళ్లే వాహనాలు (ఏపిసి) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసివి), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగగలిగే యుద్ధ వాహనాలు (ఏసిటివి) మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది. యుద్ధ వ్యూహ తంత్రానికి సంబంధించిన వాహనాలు (టిఎంఏవి), మందపాతరలను తట్టుకోగలిగే వాహనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.వీటికి తోడు మిస్సయిల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగులు (క్యానన్) ఉత్పత్తి చేసేందుకు మేఘాకు అనుమతి లభించింది. మిస్సయిల్స్ వ్యవస్థను భూమి, సముద్రం, ఆకాశ మార్గం నుంచి ఉపయోగించడానికి వీలుగా ఇక్కడ ఉత్పత్తికానున్నాయి. అదే విధంగా యుద్ధంలో కీలకంగా ఉపయోగించే హొవిట్జర్స్, యాంటి ట్యాంక్ వెపన్స్, రైఫిల్స్ తదితర యుద్ధ సామాగ్రిని ఉత్పత్తి చేయనుంది.

దేశంలోనే మొట్ట మొదటి వైరాలజి ల్యాబ్

కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎంఈఐఎల్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ను గత నెల ఏప్రిల్ లో ప్రారంభించారు. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీలోకి ప్రవేశించిన ఎంఈఐఎల్ గ్రూప్ సంస్థ ఐకామ్ టెలి మొబైల్ వైరాలజీ పరిశోధన మరియు కోవిడ్ -19 నమూనాలను పరీక్షించడానికి డయాగ్నస్టిక్స్ ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ కోవిడ్ -19 స్క్రీనింగ్, సంబంధిత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బయో-సేఫ్టీ ప్రమాణాల ప్రకారం ఈ మొబైల్ ల్యాబ్ ను ఐకామ్ సంస్థ రూపొందించింది.

డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీతో పాటు, ఐకామ్ టెలి విద్యుత్ ప్రసారం, పంపిణీ, సౌర, చమురు, గ్యాస్ రంగాలో కూడా ఉంది. ఇది బ్రహ్మోస్, ఆకాష్, పిజిఎడి, ప్రలే, ఎంఆర్ఎస్ఎమ్, ఎక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ వంటి క్షిపణి కార్యక్రమాలకు అధునాతన కమ్యూనికేషన్ రేడియోలు, జామర్ యాంప్లిఫైయర్లు, కంటైనర్‌ను సరఫరా చేస్తుంది. ఈ సంస్థ భారత వైమానిక దళానికి ‘విండ్ ప్రొఫైల్ రాడార్’ను అభివృద్ధి చేసింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఇపిసి) సంస్థగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, తమిళనాడులో విస్తరించి ఉన్న 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఇది అమలు చేసింది.

మేఘా ఇంజనీరింగ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఎత్తిపోతల పథకం హంద్రీనీవా సుజల స్రవంతిని నిర్మించింది.దీనిలో భాగంగా అత్యంత సుదూర ప్రాంతాలకు, ఎత్తైన ప్రాంతానికి నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పంపింగ్ చేస్తోంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం, పట్టిసీమ, నంబులపూలకుంట (ఎన్పీకుంట) విద్యుత్ సబ్ స్టేషన్ ను రికార్డు సమయంలో పూర్తి చేసింది ’మేఘా.వీటికి తోడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ లోని 50 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, గుజరాత్ లో 10 మెగావాట్ల అరుదైన కెనాల్ టాప్ సోలార్ ప్రాజెక్టును ఎంఇఐఎల్ నిర్మించి రికార్డ్ నెలకొల్పింది. కృష్ణా-పెన్నా, కృష్ణా-గోదావరి, గోదావరి-ఏలేరు, నర్మద- క్షిప్రా – సింహస్థ ఇలా దేశంలో ఐదు నదులను మొదటి సారిగా అనుసంధానం చేసింది. హైదరాబాద్ సిటీ తాగునీటి కష్టాలను దూరం చేయడానికి ఆసియాలోనే అతిపెద్ద తాగునీటి పథకాన్ని నిర్మించింది మేఘా. దేశంలోనే తొలిసారిగా అత్యంత పెద్దదైన వెస్ట్రన్ యూపి పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ (WUPPTCL) విద్యుత్ సరఫరా (పవర్ ట్రాన్స్మిషన్) వ్యవస్థను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ దేశంలో 29 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పాధక సామర్థ్యంతో పోలిస్తే ఈ సరఫరా వ్యవస్థ 5వ స్థానంలో ఉంటుంది. ప్రపంచంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్ నైపుణ్యాలను దేశంలో అనేక ప్రాజెక్టు లను తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఎన్పీకుంట విద్యుత్ సబ్ స్టేషన్, పట్టిసీమ ప్రాజెక్ట్‌లను ఏడాదిలోనే పూర్తిచేసినందుకు గాను లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించింది.