మోసగాళ్లు మూవీ స్నీక్ పీక్ లక్కీ వ్యూయర్స్ రివ్యూ

విష్ణు మంచు, అందరికి సుపరిచితమైన తెలుగు నటుడు. ఇప్పటిదాకా ఆయన నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు విడుదల కాబోతున్న మోసగాళ్లు మరొక ఎత్తు. దానితో ఆ చిత్రం యొక్క విడుదల తేదీ మార్చ్ 19 ఎప్పుడు వస్తోంది అని ఎదురు చూస్తున్న తరుణం లో కొందరు ప్రేక్షకులను ఒక కాంటెస్ట్ లో ఎంచుకొని వాళ్లకు చిత్రం లో ని పది నిముషాల నిడివి గల దృశ్యాలను ప్రదర్శించారు. దాని రివ్యూ ఇలా ఉంది.

మోసగాళ్లు మూవీ స్నీక్ పీక్ లక్కీ వ్యూయర్స్ రివ్యూ- news10.app

ఈ చిత్రం విష్ణు మంచు కు ఒక “కంబ్యాక్” అని చెప్పవచ్చు. అటు నటుడి గా ఇటు ప్రొడ్యూసర్ గా టాప్ మార్కులు కొట్టేసాడు. బలమైన కథ తో మరింత ఆసక్తికరమైన కథనం తో ఆకట్టుకున్నాడు.

కథ విషయానికి వస్తే.. అర్జున్ మరియు అను అక్కాతమ్ముళ్లు. ప్రతీ విషయం లో తానై ముందుండే అక్క అను పాత్రలో కాజల్, ఆమె మాటలను జవదాటకుండా పాటించే తమ్ముడు పాత్ర లో విష్ణు మంచు నటన అకట్టుకుంది. కాజల్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. కాగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విష్ణు మంచు గురించి.

ఈ చిత్రంలో విష్ణు మంచు లోని కొత్త కోణాన్ని చూస్తాం. ఇప్పటిదాకా ప్రధానంగా కేవలం కామెడీ డ్రామా లకు పరిమితమైన విష్ణు మంచు ఈ చిత్రం లో చాలా ఫ్రెష్ గా కనబటమే కాకుండా ఆ పాత్రలో ఇమిడిపోయారు.

సునీల్ శెట్టి ఇందులో కుమార్ అనే పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తారు. నవదీప్, నవీన్ చంద్ర ఇతర నటీనటులు వారి వారి యొక్క నటనతో వీరికి బాసట గా నిలిచారు.

అక్కాతమ్ముళ్ల ఈ స్కాం ఎందుకు చేస్తున్నారు. వారి లక్ష్యం ఏమిటి. ఇలాంటి విషయాలు కట్టిపడేస్తాయి. పది నిముషాల నిడివి గల స్నీక్ పీక్ లో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని ప్రదర్శించారు. మిగితా చిత్రం ఎలా ఉంటుంది అనే ఆసక్తి పెంచే విధంగా ఉండి ఆకట్టుకుంది.

ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.