నిఖిల్‌ ’18 పేజెస్’

యంగ్‌ హీరో నిఖిల్, మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2′ సినిమాను మొదలెట్టిన సంగతి తెలిసిందే. కాగా మరో వైపున సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఇంకో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా మొదలుకానుంది. ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం.

ఈ సినిమాకి ’18 పేజెస్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ‘కుమారి 21F’ విజయవంతం కావడంతో, ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాలో టైటిల్ లోను నెంబర్ ఉండేలా సూర్య ప్రతాప్ చూసుకున్నాడని అంటున్నారు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమా, నిఖిల్ కి మరో హిట్ ఇవ్వడం ఖాయమనే ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.