భూసేకరణలో అధికారి చేతివాటం…?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టెక్స్ టైల్ పార్క్ భూసేకరణ ఆ అధికారికి కాసులవర్షం కురిపించిందట వరంగల్ కలెక్టరేట్ లో సాధారణ అధికారి గా ఉన్న తనను కోట్లకు అధిపతిగా మార్చిందని విశ్వసనీయ సమాచారం. భూసేకరణ విషయంలో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఈ అధికారి బాగానే చేతివాటాన్ని ఉపయోగించి దండిగానే వెనకేసుకున్నట్లకు ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతుంది. వివరాల్లోకెళితే వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టెక్స్ టైల్ పార్క్ కోసం ప్రభుత్వం రైతుల వద్ద నుండి 13 వందల ఎకరాలను సేకరించింది… ఆ టెక్స్ టైల్ పార్క్ లో భూమి కోల్పోయిన రైతులకు ఎకరాకు 8 లక్షల రూపాయలను నష్ట పరిహారం గా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ, పరిహారం చెల్లింపులు అంతా ఆర్డీవో కార్యాలయ కేంద్రంగానే జరుగుతాయి.. అదే ఈ అధికారికి బాగా కలిసొచ్చిందని ఆ కార్యాలయ ఉద్యోగులు బాహాటంగానే చెప్తున్నారు.. ఆర్డీవో కార్యాలయం కేంద్రంగా రైతులకు పరిహారం ఇప్పించే విషయంలో ఈ అధికారి తన తెలివిని ఉపయోగించి అందినకాడికి దండుకున్నట్లు తెలుస్తుంది… పైసా ముట్టనిదే పరిహారం ఇచ్చేదిలేదన్నట్లు పరిహారం కోసం వచ్చే రైతుల వద్ద నుంచి ముందుగానే కావాల్సింది పుచ్చుకొని ఈ అధికారి ఆనిచేసిపెడుతున్నట్లు తెలిసింది.అడిగింది ఇస్తే తప్ప పని కాదని అడిగింది ముట్టజెప్పితే పని ఇట్టే జరిగిపోతోందని రైతులు అంటున్నారు… తమ భూమి కోసం వచ్చే పరిహారం ఇప్పించడానికి ఆ అధికారి అడిగింది సమర్పిస్తేనే పని చేసిపెడుతున్నాడని రైతులు ఆవేదన చెందుతున్నారు.

భూసేకరణలో అధికారి చేతివాటం...?- news10.app

ఎకరాకు ఓ రేటు …?

భూసేకరణ లో భాగంగా రైతులకు పరిహారం చెల్లించే క్రమంలో ఆర్డీవో కార్యాలయంలో ని ఆ అధికారి ఎకరాకు ఓ రేటు ఫిక్స్ చేశాడట. సర్వే నెం తప్పుగా నమోదు అయితే ఓ రేటు, భూమి తగాదా ఉంటే మరో రేటు అని ప్రతి చిన్న చిన్న లోపాలను వెతికిమరీ రైతుల వద్ద లక్షల్లో వసూళ్లు చేసినట్లు ఆ అధికారి భాదితులు న్యూస్-10 కు తెలిపారు.. తమను ఏవిధంగా ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిప్పించి వసూళ్లకు పాల్పడ్డాడో చెప్పారు..డిమాండ్ చేసిన మొత్తంలో పైసా తగ్గిన పనిచేసేవాడే కాదని వారు వాపోయారు..

వసూళ్లు చేసాడు… వాటాలు పంచేసాడు…?

వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని టెక్స్ టైల్ పార్క్ క్రింద భూములు కోల్పోయిన భాదితులకు నష్ట పరిహారం చెల్లించే విషయంలో ఈ అధికారి హవా మాములుగా ఉండదట… రైతులకు చుక్కలు చూపించి వారి దగ్గర నుండి భారీగానే ర వసూలు చేసాడట.. వసూళ్లు చేసిన మొత్తాన్ని ఈ అధికారే హోదాను బట్టి అధికారులకు వాటాలు పంచే భాధ్యతను కూడా తీసుకుని అందరికి ఆమోదయోగ్యంగా ఉంటాడని అందుకే ఆయన తో పెద్దసార్లు ఎవరైనా దోస్తీ చేస్తారని విశ్వసనీయ సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకొనే ఎం చేసిన చెల్లుతుంది తనను అనే అధికారి ఎవరు లేరనే ధీమాతో రైతుల ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడని ఈ అధికారిపై ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పలుకుబడి,కొంతమంది అధికారుల అభయం తో ఇతగాడు బాగానే రెచ్చిపోతున్నట్లు ఆర్డీవో కార్యాలయ ఉద్యోగుల్లోనే చర్చ జరుగుతోంది.

కోట్లకు పడగలెత్తిన అధికారి..?

వరంగల్ జిల్లా ఆర్డీవో కార్యాలయంలో పని చేసే ఈ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తినట్లు తెలిసింది .తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టెక్స్ టైల్ పార్క్ ఇతగాడికి కోటీశ్వరునిగా మారడానికి మార్గం సుగమం చేసినట్లు తెలుస్తోంది. టెక్స్ టైల్ పార్క్ లో భూమి కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించే విషయంలో రైతుల వద్ద నుండి పెద్ద మొత్తంలో దండుకొని ధనవంతుడు అయ్యాడని కార్యాలయంలో ఉద్యోగులు గుసగుసలాడుకోవడం గమనార్హం.ఇంతగా రైతుల వద్ద నుంచి వసూళ్ల కు పాల్పడుతున్న ఈ అధికారిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారో వారికే తెలియాలి…ఇంత బాహాటంగా రైతుల వద్దనుంచి దండుకుంటున్న చూసి చూడనట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఏమాత్రం అర్థం కాని విషయం.ఇకనైనా ఈ అధికారిపై చర్యలు తీసుకుంటారా లేక దండుకోమని వదిలిపెడుతారా.. చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here