సాకారం దిశగా పోలవరం- గడ్డర్ల ఏర్పాటుతో కీలకదశకు స్పిల్ వే

గత ప్రభుత్వం లా గ్రాఫిక్స్ లేవు. మీడియా హడావుడి అంతకంటే లేదు. కానీ పోలవరంలో మాత్రం పనులు చాపకింద నీరులా పరుగులు పెడుతున్నాయి. కాదు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తొలిసారిగా పోలవరంలో హైడ్రాలిక్ పద్ధతిలో భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేయనున్నారు. ఈ హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసే విధనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేసేందుకు గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఇందుకోసం సోమవారం పూజలు నిర్వహించి సూచన ప్రాయంగా పనులు పని ప్రారంభించారు. ఈ రోజు నుంచి మొత్తం గిడ్డర్ల ప్రక్రియ మొదలైంది. వీటిని ఏర్పాటు చేసిన తరువాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగిస్తారు. మామూలుగనైతే ఎలక్ట్రోమెకానికల్ గేట్లనుఎత్తడం దించడం చేస్తారు. దీనివల్ల నిర్వాహణ వ్యయంతో కూడికూన్నది. పోలవరం ఈ సమస్య ఎదురుకాకుండా హైడ్రాలిక్ గేట్ల వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేస్తోంది.

గడ్డర్ల ఏర్పాటుతో…

మేఘా ఇంజనీరింగ్ సంస్థ పర్యక్షణలో ప్రపంచంలోని అతిపెద్ద గడ్డర్ల ఏర్పాటు పనులు పోలవరంలో ప్రారంభమైయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు చేపట్టే సమయానికి పియర్స్‌ పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి 52మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. స్పిల్‌వే పియర్స్‌ పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్‌ ఛానల్‌ పనుల్లో సింహభాగం పూర్తి అయినట్లే. పోలవరం స్పిల్‌వే పియర్స్‌ పై 196 గడ్డెర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు ఉంటుంది. ఒక్కొక్క గడ్డర్ పొడవు దాదాపు 22.5 మీటర్లు ఉంటుంది. ఒక్కో గడ్దర్‌ తయారీకి 25 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, 10 టన్నుల స్టీల్ ను వినియోగించారు. మొత్తం 1960 టన్నుల స్టీల్, 4900 టన్నుల కాంక్రీట్ ను వినియోగించారు. ఆ తరువాత దానిపై కాంక్రీట్‌తో రోడ్‌ నిర్మిస్తారు. ఈ రోడ్‌ నిర్మాణానికి సుమారు ఐదువేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ అవసరం అవుతుంది. ఇప్పటికే 110 గడ్డర్లు స్పిల్‌ వే పై ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం రెండు నెలల్లలోనే మేఘా సంస్థ వీటిని ఏర్పాటు చేసింది.

జెట్ స్పీడుతో పోలవరం పనులు..

ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ జెట్ స్పీడ్తో కాంట్రాక్ట్ సంస్థ మేఘా పనులు పూర్తి చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కల సాకారం దిశగా పనులు సాగుతున్నాయి. వర్షా కాలంలో కూడా పనులకు ఆటంకం కలగకుండా మేఘా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాదిలోనే ఏపీ ప్రజల తాగు, సాగునీటి అందించేలా ప్రాజెక్టు పరుగులు పెడుతోంది. ఏపీ ప్రజల సాగు, తాగు, విద్యుత్ అవసరాల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారంగా పనులను వాయువేగంతో ఉరకెలేత్తిస్తోంది. మేఘా సంస్థ జూన్‌ చివరి నాటికి స్పిల్‌ వే లో 1. 41 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌ లో 1,11 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, జల విద్యుత్‌ కేంద్రం ఫౌండేషన్‌ లో 3. 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు, మట్టి తీసే పని 10. 64 లక్షల క్యూబిక్‌ మీటర్లు, రాయి తొలిచే పనులు 1.14 లక్షల క్యూబిక్‌ మీటర్లు, వైబ్రో కంప్యాక్షన్‌ పనులు 10. 86 లక్షల క్యూబిక్‌ మీటర్లు పని చేసింది. గడువులోగా ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయాలనే దృఢమైన సంకల్పంతో పనులు సాగుతున్నాయి.

నాడు వైఎస్‌ బీజం – నేడు జగన్‌ నిర్మాణం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనిని నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖరెడ్డి చొరవతో 2005లో నిర్మాణా పనులు మొదలయ్యాయి. దాదాపు కుడి ఎడమ కాలువ అప్పుడే పూర్తయ్యాయి. అప్పట్లో తవ్విన కుడికాలువపైనే పట్టిసీమను ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా కేంద్రం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. దేశంలో 23 జాతీయ ప్రాజెక్టులను ఇప్పటివరకూ నిర్మించారు. ఇందులో కొన్నింటిని నిర్మిస్తున్నారు. ఏ ప్రాజెక్టునైనా జాతీయ ప్రజెక్టుగా ప్రకటించాక నిర్మాణ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాలి. అయితే టిడిపి అప్పటికే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం ఇపుడే అధికారంలోకి వచ్చాం ఎంత అందితే అంత నొక్కేయాలని నిర్ణయానికి వచ్చిన టీడీపీ పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులతో చేపట్టేలాగ అనుమతులు సాధించుకుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ ప్రాజెక్టుకు డబ్బు మీరివ్వండి నిర్మాణ బాధ్యతలు మేం చేపడతాం అని చెప్పలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయంలో పట్టుపట్టి మరీ సాధించుకుంది. ఆ పట్టు వెనుక ఉన్న మర్మం ఏమిటో ఆ తరువాత జరిగిన పరిణామాలు, ప్రధాని అప్పట్లో చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లం అయ్యింది.

2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమకు అప్పగిస్తే రాకెట్‌ వేగంతో పూర్తి చేస్తామని హామీనిచ్చింది. నాటి సిఎం చంద్రబాబు 30 విడతలు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. 90 విడతలు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సోమవారాన్ని పోలవారంగా మార్చి హడావిడి చేశారు. 2018లో తొలి పంటకు నీరిస్తామని, రాసుకోండి అని నాటి శాసనసభలోనే ప్రజలకు స్పష్టమైన హామీనిచ్చారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనక్కు అన్నట్లుగా సాగాయి. 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రభుత్వం కీలకమైన పనులను కూడా పూర్తిచేయలేక పోయింది. ఎన్నికల సమయంలో ప్రధాని మోడి పోలవరం తెగుదేశం పార్టీ నేతలకు ఏటీఎం లా మారిందని ఆరోపించారు. గత ఏడాది ఏప్రిల్‌లో రాజమహేంద్రవరంలో జరిగిన ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్న మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

2019 ఎన్నికల్లో వైసీపి అధికారంలోకి రావటంతో జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్ధేశ్యంతో రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువ ధరకు మేఘాకు అప్పగించింది. అప్పటి నుంచి పనులు గోదావరి పరవళ్లను మరిపించేలా పరుగులు పెడుతున్నాయి. గోదావరి వరద వయ్యారం లాగా వేగంగా జరుగుతున్న పనులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.