అంగన్ వాడి కేంద్రంలో పాములు

నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి అంగన్వాడి శిథిలావస్థలో ఉన్న మొదటి కేంద్రంలో పాముపిల్లల కలకలం సోమవారంచోటుచేసుకుంది. అంగన్వాడీ కార్యకర్త జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయంరోజు లాగే అంగన్వాడీ కార్యకర్త తో పాటు ఆయా లచ్చమ్మ అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని పరిశుభ్రత చేస్తుండగా చిన్న రంధ్రంలో నుండి ఒక పాము పిల్ల కనిపించడంతో భయాందోళనకు గురి అయ్యారు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో 40 పాము పిల్లల్ని ఒక తేలును బయటికి తీసి చంపారు.

అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన వైస్ ఎంపీపీ…

అంగన్వాడీ కేంద్రంలో పాముపిల్లల కలకలం రేగడంతో స్థానిక ఎంపిటిసి, వైస్ఎంపీపీ జెల్లావెంకటేష్ కేంద్రానికి చేరుకొని వాటిని వెలికి తీసి గ్రామస్తుల సహకారం తో చంపారు. సూపర్వైజర్ గౌసియా బేగం ని వివరణ కోరగా తక్షణమే అక్కడి నుండి కేంద్రాన్ని షిఫ్ట్ చేస్తామని తెలిపారు.