పోలవరంపై టీడీపీ కుట్ర…?

ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే దానికి అడ్డుకోవడానికి పచ్చ పార్టీతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా కుయుక్తులతో అడ్డుకుంటోంది. పొంతనలేని కారణాలు చెబుతూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకొని అనసవర ఆరోపణలు చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో వైసీపీ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా.. ఇటుక కూడా కదల్చలేదంటూ పచ్చ పార్టీ నాయకులు లేని పోని కామెంట్లను చేస్తూ ప్రజలను అయోమానికి గురి చేస్తున్నారు. ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో.. అంతకంటే ఎక్కువే శ్రమ పడుతున్న జగన్ పై వీరు ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నాయకులు అంటున్నారు.

పోలవరం జలాశయంలో ప్రస్తుతం అంచనాల వ్యయం 1656 కోట్లు పెంచడంపై గగ్గోలు పెడుతున్న తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ పచ్చ మీడియా 2016లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు రూ. 1500 కోట్లు అంచనా వ్యయం పెంచడంపై అప్పుడు, ఇప్పుడు నోరు విప్పడం లేదు. ప్రస్తుతం పెరిగిన పనుల వల్ల అంచనా వ్యయం పెరిగింది. కానీ 2016 లో ప్రాజెక్ట్ (హెడ్ వర్స్క్) అంచనా వ్యయాన్ని 4054 కోట్ల నుంచి 5535 కోట్లకు పెంచారు. అంటే 1481 కోట్ల రూపాయలు పెంచుతూ 2016 సెప్టెంబర్ 8న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

2013లో అప్పటి సంస్థ 4054 కోట్లకు పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2015-16 సవరించిన అంచనాల ప్రకారం అంచనా వ్యయం పెంచాలని అప్పటి నిర్మాణ సంస్థ కోరడంతో ఆ మేరకు చంద్రబాబు ప్రభుత్వం వ్యయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనిపై అప్పట్లో వైసిపి కానీ, తెలుగుదేశం అనుబంధ మీడియా కానీ నోరు విప్పలేదు. ఇప్పుడు పెంచిన ధరలపైనే గగ్గోలు పెట్టడం వారి ద్వంద నీతికి అద్దం పడుతోంది.

పొలవరం ప్రాజెక్టులు ఏదైనా అంశాలను పెంచాలన్నా, సవరించాలన్న కేంద్ర జలసంఘం అనుమతి తప్పని సరి. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం కేంద్ర జలసంఘం ఆధీనంలో ప్రత్యేక అథారిటీ పర్యవేక్షణలో జరుగుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలియనిది కాదు. పోలవరం అతిపెద్ద వదర డిశ్చార్జ్ కలిగిన ప్రాజెక్టు కావడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొత్తం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులే పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా సంభవించిన వరదలకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు పలు చోట్ల దెబ్బతింది. ముఖ్యంగా డయాఫ్రం వాల్, అప్పర్ కాఫర్ డ్యాంలతో పాటు మట్టి కట్టలు కోతకు గురయ్యాయి. వీటిని అప్పటి ప్రభుత్వం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేయడం వల్ల ఆ పనులు దెబ్బతిన్నాయి.

వీటిని దృష్టిలో పెట్టుకొని 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా జలాశయం తట్టుకుని స్పిల్ వే మీదుగా జలాశయం పోయే విధంగా నిర్మాణ పనుల్లో, డిజైన్లలో తరుచూ కేంద్రం మార్పులు చేస్తోంది. ఈ మార్పుల ఆధారంగా నిర్మాణ పనుల్లో వ్యత్యాసం, ముఖ్యంగా పరిమాణం పెరుగుతోంది. దీంతో ఒక్క అప్రోచ్ ఛానెల్లోనే దాదాపు కోటి ఇరవై లక్షల ఘనపు మీటర్ల మట్టిని తవ్వాల్సి వస్తోంది. తొలుత వేసిన అంచనా కన్నా ఇది నాలుగు రేట్లు అధికం. ఈ విధంగా డిజైన్లకు అనగుణంగా మార్పులు జరుగుతున్నాయి. ఇంకా మూడు డిజైన్లకు సంబంధించి అనుమతి రావాల్సి ఉంది.

అయితే నిన్నటి వరకు పోలవరం ప్రాజెక్టులో తట్ట మట్టి తీయలేదు… అంటూ ముసలి కన్నీరు కార్చిన పచ్చ పార్టీ నేతలు ప్రాజెక్టు పనులు వర్క్ ప్రొగ్రేస్ చూసి కుళ్లుకునే పరిస్థితి దాపురించింది. అయితే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పొద్దామా.. అని ఎదురుచూస్తున్న పచ్చ పార్టీ నేతలకు పచ్చమీడియా తోడైంది. పోలవరం ప్రాజెక్టు అదనపు పనులను ఇటీవలే జలసంఘం సూచన మేరకు 683 కోట్ల పనులకు టెండర్లను పిలిచింది. అంతేకాకుండా ఇటీవల డిడి ఆర్పీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి పనులు వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి కూడా వ్యక్తం చేశారు. అయితే కేంద్రం సూచనతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తున్న జగన్ సర్కారుపై టీడీపీ నేతలు, పచ్చ మీడియా దుష్ప్రచారాన్ని చేస్తోంది. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలు గమనించి గందగోళానికి గురి కావద్దని వైసీపీ నేతలు తెలుపుతున్నారు.