పోలీసులు మాకు శత్రువులు కాదు….

ఆపరేషన్ ప్రహార్ సైనిక దాడిని ఓడిద్దాం విప్లవ ఉద్యమాన్ని కాపాడుకుందాం…
వాజేడు, వెంకటాపురం మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరిట లేఖ విడుదల
ఏప్రిల్ 26న భారత బంద్… జె ఎం డబ్ల్యు పి డివిజన్ లో అన్ని వర్గాల ప్రజలు బంద్ ను విజయవంతం చేయాలని పిలుపు

ఆపరేషన్ ప్రహర సైనిక దాడిని ఓడిద్దాం నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంతో కొనసాగుతున్న భారత విప్లవ ఉద్యమాన్ని కాపాడుకుందాం సైనిక దాడులను నిరసిస్తూ ఏప్రిల్ 26న భారత బందులో భాగంగా జె ఎం డబ్ల్యు పి డివిజన్ లోని అన్ని వర్గాల ప్రజలు బందును విజయవంతం చేయాలని వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ పేరిట మావోయిస్టులు మీడియాకు లేఖ విడుదల చేశారు.

ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాదుల దళారీ పెట్టుబడిదారుల ఆదేశాలనుసారం జల్ జంగిల్ జమీన్ ఖనిజ సంపదను దోచుకోవడానికి అడ్డుగా ఉన్న మావోయిస్టు పార్టీని అణిచి వేయడానికి సమాధాన్ దాడిలో భాగంగా ప్రహార్ సైనిక దాడిని 2019 డిసెంబర్ నుండి మొదలుపెట్టారని, 2020 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఈ దాడిలో దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా ప్రజలు పి ఎల్ జి ఎ సభ్యులు కమాండర్ వివిధ స్థాయిలో నాయకత్వం వహించిన కామ్రేడ్స్ ను బూటకపు ఎన్ కౌంటర్ ల ద్వారా చిత్రహింసలు విష ప్రయోగాల ద్వారా పోలీసు బలగాలు హత్య చేశారని ఆరోపిస్తూ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టులను త్వరగా నిర్మూలించడానికి ప్రధానంగా దండకారణ్య ఉద్యమాన్ని నిర్మూలించడానికి డీకే ఉద్యమానికి అనుబంధంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుండి దాడులు మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారని అన్నారు. 2020 అక్టోబర్ 5న జాతీయ భద్రతా సలహాదారుడు నరహంతక విజయ్ కుమార్ నాయకత్వంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తో సహా ఐదు రాష్ట్రాల పోలీసు అధికారులతో కలిసి తెలంగాణ లోని వెంకటాపురం మండలంలో కేంద్ర స్థాయి సైనిక దాడికి పథకం రచించారని, 2020 నవంబర్ నుండి 2021 జూన్ వరకు తెలంగాణ నుండి దాడులు మొదలుపెట్టి ఎనిమిది నెలల్లో మావోయిస్టులను నిర్మూలించడానికి ప్రకటన చేసి డీకే బోర్డర్లో నవంబర్ 8 డిసెంబర్ 25 జనవరి 18 ఫిబ్రవరి ఆరో తారీకు తెలంగాణ దక్షిణ బస్తర్ బలగాలపై వేలాదిమంది గ్రేహౌండ్స్ బలగాలు దాడులు నిర్వహించారని, ఏప్రిల్ 3వ తేదీన ప్రజల రక్షణ కొరకు దాడికి వచ్చిన రెండు వేల మంది కోబ్రా, ఎస్ టి ఎఫ్ డి ఆర్ జి, బస్తర్ బెటాలియన్ బలగాలపై పి ఎల్ జి ఏ ప్రతి దాడి కొనసాగించిందని, ఈ దాడిలో 28 మంది పోలీసులు మృతిచెందగా 31 మంది పోలీసులకు గాయాలు ఆ పోరాటంలో నలుగురు మావోయిస్టులు అమరుల అయ్యారని పేర్కొన్నారు

పోలీసులు మాకు శత్రువులు కాదు….

పోలీసులు మాకు శత్రువులు కాదని మాకు అసలైన శత్రువులు సామ్రాజ్యవాదులు భూస్వాములు దళారీ పెట్టుబడిదారులు అని అన్నారు. అన్యాయమైన ఉద్యమాలు పేద ప్రజల బిడ్డగా పుట్టి పోలీసులు గా మారిన తర్వాత వేలాది మంది ప్రజలను చిత్రహింసలు గురి చేస్తున్నారని మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ఎంతోమంది అభాగ్యులను కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ప్రజల వనరులు సంపదను కాపాడడంలో భాగంగా ఎల్ జి ఎ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతి దాడి చేయాల్సి వస్తుందని ఈ అన్యాయమైన ఉద్యమంలో మీరు పాల్గొనకపోతే పాలకవర్గాలను ప్రజలు ఓడిస్తారు అన్నారు.

బలిపశువులు కావద్దు….

బీజేపీ మోడీ ప్రభుత్వం బ్రాహ్మణీయ హిందూ రాజ్యస్థాపన లక్ష్యంతో మావోయిస్టులు లేని నవభారతం నిర్మిస్తాం అంటూ మోడీ అమిషా లు ప్రకటన చేస్తున్నారు కరోనా ముసుగులో ప్రజా వ్యతిరేక చట్టాలను అనేకం చేశారు వాటిని అమలు చేయడానికి ఫాసిజాన్ని అమలు చేస్తున్నారు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు జాతులు సమస్త సంస్థల మీద దళితులు ఆదివాసులు మత మైనార్టీలు కార్మికులు మహిళలు రైతులు విద్యార్థులు ఉద్యోగులు ప్రజాస్వామికవాదులు ప్రజలపై ఫాసిజం దమనకాండను కొనసాగిస్తున్నారు వ్యవసాయ రం గాన్ని పూర్తిగా యూటీ చేయడానికి ప్రధాని అంబానీ సామ్రాజ్యవాద కార్పొరేట్ లాభాల కోసం ప్రమాదకరమైన 3 వ్యవసాయ చట్టాలను ఆమోదించడం లో భారత రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఈ పోరాటంలో 300కు పైగా రైతులు చనిపోయారు విశాఖ ఉక్కు ను ప్రైవేటికరిస్తాం మని ప్రకటించడం ఇదే కాదు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల నీటిని మోడీ ప్రైవేటీకరణ చేస్తామని బహిరంగంగా ప్రకటించిందన్నారు.

పీడిత ప్రజల భూములను ఆక్రమిస్తున్నారు….

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం ఓసీలు అభయారణ్యాలు ధరణి పోర్టల్ పేరుతో ఆదివాసి పీడిత ప్రజల భూములను ఆక్రమిస్తూ కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని, ప్రజలను మావోయిస్టు పార్టీని అణచివేయడానికి సమాధాన్ బహుముఖ దాడి ప్రహర సైనిక దాడిని కొనసాగిస్తున్నారు గ్రేహౌండ్స్ పాల మిలటరీ బలగాల ద్వారా ఎడతెరపి లేకుండా కూంబింగ్ కొనసాగిస్తున్నారు బూటకపు ఎన్కౌంటర్లో హత్యలు అరెస్టులు జైలు చిత్రహింసలు విష ప్రయోగాలు అణచివేత పద్ధతులను అమలు చేస్తున్నారు కొత్తగూడెం కేంద్రంగా నూతన పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటనలు చేస్తున్నారు. నూతన ప్రజాస్వామిక లక్ష్యంతో రైతులు కార్మికులు పెట్టుబడి భూస్వామి జాతీయ బూర్జువా వర్గాలతో ఏర్పడి ప్రజాప్రభుత్వ లక్ష్యంగా కొనసాగుతున్న విప్లవ ప్రజా యుద్ధమే సరైన మార్గమని, దోపిడి పాలకులను ఓడిస్తాం పీడిత ప్రజల రాజ్యాధికారం సాధిస్తాం ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకుంటాం కేంద్రంలో మోడీ బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఫాసిస్ట్ ఆపరేషన్ ప్రహార్ సైనిక దాడికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 26న బందును పాటించి భారత్ బంద్ విజయవంతం చేయాలని లేఖలో పిలుపునిచ్చారు.