నన్నే ప్రశ్నిస్తావా…?

ఎం రాస్తున్నవయ్య నువ్వు… నా పై ఎం రాశావ్.. మేడం పై ఎం రాశావ్… నువ్వేమన్న నా పై ఆపిసర్ వా… నా డైరెక్టర్ వా ఊకే అదేంది సర్ ఇదేందీ సర్ అని ప్రశ్నిస్తున్నవ్… మా ఎంబడి తలగడానికి నికేమైన ఇది ఉందా….? డిసి లు ఏసీ లు ఉన్నరు వాళ్ళను అడుగు… నీ కార్డు ఇయ్యి కేసు బుక్ చేస్తా… ఇది గ్రేటర్ వరంగల్ నగరం టౌన్ ప్లానింగ్ అధికారి వెంకన్న నాయక్ న్యూస్10 ప్రతినిది కి మాటల్లో ఇచ్చిన మర్యాద… ఓ జర్నలిస్ట్ గా వార్త కథనం రాసే ముందు వివరణ కోసం వెళితే స్పందించిన తీరు. నన్నే ప్రశ్నిస్తావ… అక్రమ నిర్మాణాలపై రాస్తావ మా మేడం పై రాస్తారా…? కార్యాలయానికి వెళ్లి అక్రమనిర్మాణాలపై ప్రశ్నించినందుకు ఆయన ఇంతెత్తున లేచి చిందులు వేసిన తీరు… మా సిబ్బంది అలాగే చూస్తూ ఉంటారు వార్తలు రాస్తే వాళ్ళు భయపడి పోరా.. అంటూ అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలికిన వైనంతో వివరణ కోసం వెళ్లిన న్యూస్10 ప్రతినిధి అవాక్కుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నన్నే ప్రశ్నిస్తావా...?- news10.app

మంగళవారం ఉదయం అక్రమ నిర్మాణాలపై వివరణ కోసం వెళ్లిన న్యూస్10 ప్రతినిది ని బెదిరించే ప్రయత్నం చేసాడు టౌన్ ప్లానింగ్ అధికారి. రిపోర్ట్ పెట్టాను నాకేం సంబంధం లేదు అంతా ఎన్ ఫోర్స్ మెంట్ చూసుకుంటుంది అని అక్రమనిర్మాణాలపై చర్యల విషయంలో చేతులెత్తేసిన ఆయన నాకు ఇదొక్కటే పని ఉందా అని కొట్టినంత పని చేశారు… నాలాలపై రాయి అక్రమ నిర్మాణాలపై ఎందుకు…?అంటూ పనిలో పనిగా ఓ ఉచిత సలహా ఇచ్చారు. అంతేకాదు ఎవరో జర్నలిస్ట్ అనుమతి లేకుండా అదనపు అంతస్తులు కట్టాడని న్యూస్10 ప్రతినిధి ముందే తన సిబ్బందికి ఫోన్ చేసి ఆ వివరాలు పంపు చర్యలు తీసుకుందాం అంటూ వార్తలు రాసినందుకు రివేంజ్ తీసుకునేలా ప్రవర్తించారు టౌన్ ప్లానింగ్ అధికారి. తనకు స్టాప్ సరిగా లేరని అసహనం వ్యక్తం చేసిన ఆయన ఆ లిస్ట్ కూడా తయారు చేస్తున్న అంటూ చెప్పుకొచ్చారు… అరగంట పాటు నాన్ స్టాప్ గా బెదిరింపుల దండకం అందుకున్న అధికారి… తాను పెద్ద అధికారిని ఏదైనా చెయొచ్చు అన్నట్లు నోటికొచ్చినట్లుగా మాట్లాడారు.ఓసారి నువ్వు అంటూ…మరోసారి తమ్ముడు అంటూ ఇంకోసారి ఎందివయ్యా… అంటూ తన అధికార జులుం ను న్యూస్10 ప్రతినిదిపై ప్రదర్శించారు… సార్ సార్ అంటూ న్యూస్10 ప్రతినిధి ఎంత గౌరవంగా మాట్లాడిన వినిపించుకోకుండా…మర్యాద ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో లేని ఆ టౌన్ ప్లానింగ్ అధికారి తన నోటికి పని చెప్పారు…

( ఎక్కడిదీ ఈ ధైర్యం…ఉన్నతాధికారులు ఎం చేస్తున్నట్లు…?వాళ్ళు వీళ్ళు మిలాఖత్ …టౌన్ ప్లానింగ్ లో తలా కొంచమా…?)

రేపటి సంచికలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here