ట్రేడ్ లైసెన్స్@మూడు కోట్ల స్కామ్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఆ అధికారి అవినీతికి అంతులేకుండా పోయిందట… ఆ విభాగం ఈ విభాగం అని తేడా లేకుండా అన్ని విభాగాల్లో ఇతగాడి అవినీతి ఛాయలు కనిపిస్తున్నాయి…. అత్యంత ప్రధానమైన ప్రజల ఆరోగ్యంతో ముడిపడిఉన్న బి విభాగానికి అధికారిగా ఉన్న ఈ సారు ఎక్కడినుంచి ఎలా సంపాదించాలో ఎవరిని ఏ పనికి పురమాయిస్తే నగదు చేతికందుతుందో బాగానే తెలుసట… మ్యానేజ్ చేయడంలో బహు నేర్పరి గా పేరున్న ఈ సారు తాను పనిచేస్తున్న శాఖలోని అధికారులను బాగానే మ్యానేజ్ చేస్తాడని బల్దియాలో ప్రచారం జరుగుతోంది. దింతో ఇక్కడ ఈ సారు ఆడింది ఆటగా పాడింది పాటగా చెలామణి అవుతుందట.

ట్రేడ్ లైసెన్స్@మూడు కోట్ల స్కామ్- news10.app

తాను తీసుకునే జీతం కంటే ఇతర మార్గాల ద్వారా వచ్చే మామూళ్లు అతి రెట్టింపుగా ఉంటాయని అందుకే బల్దియాను వదిలి వెళ్లేందుకు ఈ సారు గారు ఏమాత్రం సుముఖంగా లేరని తెలుస్తుంది… అదనపు వైద్యాధికారిగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ ప్రాంతానికి గతంలో వెళ్లిన ఈ అధికారి అక్కడ పట్టుమని మూడు నెలలు కూడా పనిచేయలేక గోడకు కొట్టిన బంతిలా మల్లి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కే తిరిగివచ్చి అవినీతి దందాను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. నెలవారి మామూళ్లు బాగానే తనకు నమ్మకస్తులైన సిబ్బంది ద్వారా వసూలు చేయించే ఈ అధికారి ప్రస్తుతం ట్రేడ్ లైసెన్స్ ల జారీ విషయంలో తన చేతివాటాన్ని చూపించి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నాడట. ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా రూపాయలు మూడు కోట్ల అవినీతికి పాల్పడి ఉన్నతాధికారులకే సవాల్ విసిరే స్థాయికి ఈ అధికారి ఎదిగాడట…

ట్రేడ్ లైసెన్సుల జారీలో భారీ అవినీతి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎవరైనా వ్యాపారం నిర్వహించాలంటే ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి అదే ఈ పెద్దసారు అవినీతి కి కలిసొచ్చిందని చెప్పవచ్చు .వ్యాపారం ఉంటే ఓ రేటు లేకుంటే మరో రేటుని ఫిక్స్ చేసి ట్రేడ్ లైసెన్స్ లు జారిచేస్తాడట. ఇలా దుకాణాలు లేకున్నా వేల కొద్ది అక్రమ ట్రేడ్ లైసెన్సులు జారీ చేసినట్లు సమాచారం. నిజంగా ఉన్న దుకాణాలకు మున్సిపల్ ఫీజుకంటే అదనంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు వినికిడి.. ఇలా ట్రేడ్ లైసెన్సుల పేర సుమారు 3 కోట్లు చేతులు మారినట్లు తెలిసింది.

డిజిటల్ ఇంజనీర్ తొలగింపు

కార్పొరేషన్ లో ట్రేడ్ లైసెన్సుల పేరుతో చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని ముందే ఊహించిన పెద్ద సారు ట్రేడ్ లైసెన్స్ ల వ్యవహారాన్ని చక్కబెట్టిన ఆ డిజిటల్ ఇంజనీర్ ను ఆ స్థానం నుండి తప్పించినట్లు కార్యాలయ ఉద్యోగులే మాట్లాడుకోవడం గమనార్హం… అక్రమ ట్రేడ్ లైసెన్స్ ల విషయంలో సదరు డిజిటల్ ఇంజనీర్ సహకరించడం విషయం బయటపడితే ఎలా భయంతో ఆ ఉద్యోగిని పక్కనపెట్టి న అధికారి తిరిగి ఓ శాఖలో తానే కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించినట్లు విశ్వసనీయ సమాచారం.

సూపర్ వైజర్ లకు అదనపు బాధ్యతలు

వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో పెద్దసారు ఇష్టారాజ్యం నడుస్తోందట సారుకు మామూళ్లు సక్రమంగా ఇచ్చేవారిని అందళమెక్కిస్తాడాని ప్రచారం సాగుతోంది ..అందులో భాగంగానే ఇద్దరు సూపర్ వైజర్ లకు సానిటరీ ఇన్స్పెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించాడట. వీరిద్దరూ అదనపు బాధ్యతల కోసం సారుకు గట్టిగానే ముట్టజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

డీజిల్ ఇంచార్జి గా ఆ వ్యక్తినే ఎందుకు కొనసాగిస్తున్నారో

జి డబ్ల్యూ ఎం సి లో డీజిల్ స్కామ్ బహిరంగ రహస్యమే. కార్పొరేషన్ లోని వాహనాలకు డీజిల్ పోయించడానికి ఓ ఇంచార్జి ఉంటారు ..అయితే ఎంతోమంది ఉద్యోగులు ఉన్నప్పటికీ(సూపర్ వైజర్ లు, జవాన్ లు) ఆ వ్యక్తినే (జవాన్ ను)డీజిల్ ఇంచార్జి గా కొన్నిసంవత్సరాలుగా ఎందుకు కొనసాగిస్తున్నారని కొంతమంది జవాన్ లు సూపర్ వైజర్ లు అంటున్నారు .ఆ జవాన్ క్రమం తప్పకుండా పెద్దసారుకు మామూళ్లు ముట్టజెప్తున్నందునే అతనికి ఆ సారు సహకరిస్తున్నట్లు సమాచారం.

సానిటరీ ఇన్స్పెక్టర్ ల నుండి 20 వేలు ముట్టాల్సిందే?

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 16 మంది సానిటరీ ఇన్స్పెక్టర్ లు విధులు నిర్వహిస్తున్నారు .వీరందరూ ఒక్కొక్కరు క్రమం తప్పకుండా ప్రతి నెల పెద్దసారుకు 20 వేలు చెల్లించాల్సిందేనట లేదంటే పెద్దసారు వీరిని ఏదో ఒకరకంగా ముప్పుతిప్పలు పెడుతాడాని సమాచారం. ఈ విషయం పై న్యూస్-10 ప్రతినిధి ఓ సానిటరీ ఇన్స్పెక్టర్ ను అడుగగా తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల నుండి, కొన్ని కొన్ని హోటల్ ల నుండి,దుకాణదారుల వద్ద నుండి వసూళ్లు చేసి సారుకు చెల్లిస్తున్నామని నా పేరు బయటికి రాకుండా చూడాలని కోరారు..

లాంగ్ లీవ్ పెట్టే ఆలోచనలో సదరు అధికారి….?

మున్సిపల్ కార్పోరేషన్ లో ట్రేడ్ లైసెన్సుల పేర సుమారు 3 కోట్ల స్కామ్ జరిగిందని కార్యాలయ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు విషయం ఆ నోట ఈ నోట కమిషనర్ వరకు వెళ్లిందట. సీరియస్ గా తీసుకున్న కమిషనర్ ట్రేడ్ లైసెన్సుల వ్యవహారంపై విచారణ కూడా చేసినట్లు సమాచారం ఎలాగూ వేటు తప్పదని భావించిన సదరు అధికారి హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేపిస్తున్నాడట… కమిషనర్ వినే పరిస్థితిలో లేదని గమనించిన ఈ సారు వేటు పడకుండా లాంగ్ లీవ్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here