ఖిలా వరంగల్ అక్రమ ఇటుక బట్టీల అడ్డా…

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలంలో అనుమతులు లేని ఇటుక బట్టీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి… వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మండలంలోని నక్కలపల్లి,నల్లకుంటలో ఇటుకబట్టీలు పదులసంఖ్యలో ఏర్పాటు చేసి ఇక్కడి యజమానులు అధికారులకే చర్యలు తీసుకుంటారా…? అన్నట్లు సవాల్ విసురుతున్నారు… 24 గంటలు ఇటుకల తయారీలో నిమగ్నం అవుతున్న ఇక్కడి ఇటుకబట్టీల యజమానులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి… పని గంటల వేళల్లో సైతం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఖిలా వరంగల్ అక్రమ ఇటుక బట్టీల అడ్డా...- news10.app

ఈ ఇటుక బట్టీల విషయంలో రెవెన్యూ అధికారులకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు అంసిన కనీసం స్పందించలేదని తెలిసింది. కాగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా కన్వర్షన్ చేసుకున్న తర్వాతే వాటిలో కమర్షియల్ సంబంధించిన కట్టడాలు కానీ వ్యాపారం కానీ చేయాలి.. కానీ ఖిలా వరంగల్ మండలంలోని నక్కలపల్లి, నల్లకుంట లలో రెవెన్యూ నిబంధనలను తుంగలో తొక్కి వ్యవసాయ భూముల్లో అక్రమంగా ఇటుకబట్టిలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఇటుకబట్టిల్లో ఇటుకలను తయారు చేయడానికి గ్రామాల్లోని చెరువులనుండి అక్రమంగా రాగడి మట్టిని తవ్వుతూ చెరువులను నాశనం చేస్తున్నారు. వ్యవసాయ భూముల పక్కనే ఇటుకబట్టిలు నిర్వహించడం వల్ల అందులో నుండి వచ్చే ధుమ్ము ధూళితో పంటపొలాలు నాశనమవుతున్నాయి రోడ్ల పక్కనే ఉండడం వల్ల వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్ చేయకుండానే ఇటుకబట్టిలు నిర్వహిస్తున్న విషయం స్థానిక తహసీల్దార్ కు తెలిసి కూడా చర్యలు తీసుకుంటలేరని సమాచారం

నాలా కన్వర్షన్ అవసరం లేదా?

వరంగల్ జిల్లాలోని ఖిలా వరంగల్ మండలం నక్కలపల్లి, నల్లకుంట లలో పదుల సంఖ్యలో ఇటుకబట్టిలను వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారు… వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే వ్యాపారం కొనసాగిస్తున్నారంటే ఈ ఇటుకబట్టిలు నిర్వహిస్తున్న భూములకు నాలా కన్వర్షన్ నిబంధనలు వర్తించవా ? ఇలా నాలా కన్వర్షన్ కాకుండానే బట్టీలు నిర్వహిస్తున్నారంటే వారికి తహసీల్దార్ సహకారo ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు

కాలుష్య నియంత్రణ మండలి ఎక్కడ?

వరంగల్ జిల్లా ఖిలవరంగల్ మండలం నక్కలపల్లి లో పదుల సంఖ్యలో ఇటుకబట్టిలు నిర్వహిస్తున్నారు …వ్యవసాయ భూముల పక్కనే ఇటుకబట్టిలు ఉండడం వల్ల దాని నుండి వచ్చే ధుమ్ము, ధూళితో చుట్టు పక్కల ఉన్న పంటపొలాలు దెబ్బతింటున్నాయి… రోడ్లపై వెళ్లే వాహనదారుల కళ్ళల్లో ధుమ్ము ధూళి పడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి..

మట్టి తవ్వకానికి అనుమతులు ఏవి…?

నక్కలపల్లి లో ఇటుకబట్టిల ఇష్టారాజ్యం కొనసాగుతుంది ఇటుకలను తయారు చేయడానికి ఉపయోగించే మట్టిని అక్రమంగా చెరువుల నుండి తవ్వుతున్నట్లు సమాచారం నక్కలపల్లి లో ఏ బట్టి దగ్గర ఎటు చూసిన కుప్పలు కుప్పలుగా మట్టి దర్శనం ఇస్తుంది మరి ఈ మట్టికి ఎంత పన్ను ప్రభుత్వానికి కడుతున్నారు అసలు ఈ మట్టికి అనుమతులు ఎవరిస్తున్నారు అనేది మైనింగ్ అధికారులకే తెలియాలి… మట్టికి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెపుతుండగా ఈ విషయాన్ని పక్కనపెడితే అసలు ఈ అడ్డగోలు మట్టితవ్వకాలకు అసలు అనుమతులు ఉన్నాయా లేదా అనేది ప్రశ్న వేసవి కాలం వచ్చిందంటే చాలు ఈ తవ్వకాలు ఖిలా వరంగల్ లోని అనేక ప్రాంతాల్లో యథేచ్ఛగా కొనసాగుతుండగా ఇక్కడ తవ్విన మట్టి ప్రధానంగా ఇటుక బట్టీలకే సరఫరా అవుతుంది… ఈ మట్టి తవ్వకాల్లో ప్రధానంగా ఇటుక బట్టీల యజమానులు ప్రాధానపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి… రెవెన్యూ,మైనింగ్ అధికారులను వీరు ప్రసన్నం చేసుకొని తమ ఇష్టారీతిన మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు తెలిసింది… ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతూ ఇటుక బట్టిలు నిర్వహిస్తున్న అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here