టాస్క్ ఫోర్స్ ఎప్పుడొస్తుందో….?

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత రోజురోజుకు గ్రేటర్ వరంగల్ నగరం శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. రెండో రాజధానిగా గ్రేటర్ వరంగల్ నగరాన్ని తన ప్రసంగంలో చాలా సార్లు కొనియాడారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాంటి గ్రేటర్ వరంగల్ నగరంలో అక్రమనిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిగో అక్రమం అని వార్తలు రాస్తే…ఇదేంటని ప్రశ్నిస్తే ప్రశ్నించడానికి మీరెవరు అన్నట్లు నోటికి పని చెపుతున్నారు.గ్రేటర్ వరంగల్ నగరంలో వెలుస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవడానికి అక్రమంగా వెలిసిన వాటిని కూల్చడానికి ఓ టాస్క్ ఫోర్స్ కమిటీ కావాలి…ఆ కమిటీ కలెక్టర్ ఛైర్మెన్ గా వివిధ శాఖల అధికారులతో ఏర్పడుతుందట ఆ కమిటీ వస్తే తప్ప అక్రమనిర్మానాలపై చర్యలు ఉండవట…ఆ కమిటీ చెపితే తప్ప అక్రమంగా నిర్మాణం ఐయిన కట్టడాల కూల్చివేత జరగదట…టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం ఆ కమిటీ కోసమే నిరీక్షిస్తున్నారట.కానీ ఇప్పటి వరకు గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటివరకు టాస్క్ ఫోర్స్ కమిటీ జాడే లేదు…దింతో రోజురోజుకు అక్రమ నిర్మాణాల సంఖ్య పదుల సంఖ్యలో పెరిగి పోతుంది. అక్రమ నిర్మాణాలు కూల్చడం తమ పరిధి కాదని టౌన్ ప్లానింగ్ అధికారులు తేల్చడంతో అక్రమ నిర్మాణాలను ఆపేదేవరో తెలియడం లేదు…టాస్క్ ఫోర్స్ కమిటీ రావడం లేదు..దింతో ఈ ప్రశ్నలు సమాధానం తేలని చిక్కు ప్రశ్నలుగా మారిపోయాయి.

టాస్క్ ఫోర్స్ ఎప్పుడొస్తుందో....?- news10.app

అక్రమ నిర్మాణాల జోరు…

గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని గోపాలపూర్, ప్రకాష్ రెడ్డిపేట,నందిహిల్స్,హంటర్ రోడ్, హన్మకొండ చౌరస్తా,హంటర్ రోడ్ లోని విద్యుత్ నగర్, విష్ణుప్రియ కాలనీ ,ఎన్ ఐ టి దర్గా రోడ్డు లో పదుల సంఖ్యలో జోరుగా అక్రమ నిర్మాణాలు ఇప్పటికి జరుగుతున్నాయి.టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసే ఈ కట్టడాలు జరుగుతున్నట్లు భవన యజమానులు చెప్పుకుంటున్నారు…కానీ చర్యలు తీసుకునే అధికారం తమకు లేదు కనుకనే మెం చర్యలకు వెనుకాడుతున్నాం అని టౌన్ ప్లానింగ్ అధికారులు చెపుతున్నారు.

జాడలేని టాస్క్ ఫోర్స్ కమిటీ

గ్రేటర్ వరంగల్ పరిధిలో భవన నిర్మాణాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం కలెక్టర్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాల్సిఉందట. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ లో రెవెన్యూ,పోలీస్, అగ్నిమాపక శాఖ, ఆర్&బి మొదలగు వారు ఉంటారు .వీరందరూ కలిసి నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి కూల్చివేయాలి… అక్రమ నిర్మాణం నిజమయితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారం ఈ కమిటీ కి ఉంటుందట. అయితే గ్రేటర్ వరంగల్ లో అక్రమ నిర్మాణాలు పదుల సంఖ్యలో జరుగుతున్న ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

అక్రమ నిర్మాణాలను ఆపేదెవరు?

మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకోవడం లేదు.ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులను ఎవరైనా ప్రశ్నిస్తే అది మా పరిధి కాదని నోటీసులు ఇవ్వడానికే మాకు అధికారం ఉంది కాని కూల్చడానికి లేదని అంటున్నారూ. ఇలా అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకోక, టాస్క్ ఫోర్స్ కమిటీ పట్టించుకోకపోవడంతో ఈ అక్రమ నిర్మాణాలను ఆపేదెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి…ఈ విషయంలో ఇకనైనా ఉన్నతాధికారులు కలిగజేసుకొని వెంటనే టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాల పని పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here