తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు

1992 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్‌కు రాష్ట్ర అత్యున్నత పరిపాలనా బాధ్యతలు

కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన మూడు రోజులకే కీలక నియామకం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజు తెలంగాణ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, మూడు రోజుల క్రితమే కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. తాజాగా ఆయనను రాష్ట్ర అత్యున్నత పరిపాలనా పదవికి నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.సంజయ్ జాజు గతంలో రాష్ట్రంలో వివిధ కీలక శాఖల్లో పనిచేసి పరిపాలనలో విశేష అనుభవాన్ని సంపాదించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.పరిపాలనలో విస్తృత అనుభవం, కేంద్ర–రాష్ట్ర స్థాయిలో పనిచేసిన అనుభవంతో సంజయ్ జాజు నియామకం రాష్ట్ర పరిపాలనకు మరింత బలం చేకూరుస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here