Latest stories
రేవంత్ వ్యాఖ్యల రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదులు అందజేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కాళేశ్వరం సిస్టమ్‌లో అన్నీ నిక్షేపంగా ఉన్నాయి.. రేవంత్ బుర్ర తప్ప
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన శ్యామ్ ప్రసాద్‌రెడ్డిని పట్టుకుని చర్లపల్లి జైలులో వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ్యామ్ ప్రసాద్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసి తాను ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.కాళేశ్వరం వ్యవస్థలో రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, కాలువలు, మోటార్లు, సబ్‌స్టేషన్లు అన్నీ మంచిగానే ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం సిస్టమ్‌లో అన్నీ నిక్షేపంగా ఉన్నాయి.. ఒక్క రేవంత్‌రెడ్డి బుర్ర తప్ప’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ మృతి
బాలిక సహా ఆరుగురి హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామం వద్ద ఓ వెంచర్‌లో రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
జన నాయగన్’ వచ్చేస్తున్నాడు..!
తమిళ స్టార్ విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పలు వాయిదాలు, సెన్సార్ వివాదాల తర్వాత జూలై 24న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. విజయ్ సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘జన నాయగన్’పై దేశ, విదేశాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
బ్లడ్ ప్యాకెట్లతో రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్వీ..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) నాయకులు వినూత్న నిరసనకు దిగారు. బ్లడ్ డొనేట్ చేసి సేకరించిన రక్తం ప్యాకెట్లతో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అటవీ శాఖలో పర్సెంటేజీల అధికారి…?
ములుగు జిల్లా అటవీ శాఖలో ఓ ఇంచార్జ్ రేంజ్ అధికారి వ్యవహారశైలిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుండాల్సిన యూనియన్ నాయకుడే ప్రతి పనిలో పర్సెంటేజీలకు ప్రాధాన్యం ఇస్తూ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు శాఖలో కలకలం రేపుతున్నాయి.
రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కలో వేయాలి ..?
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలని ప్రభుత్వానికి లేఖ రాసిన రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు..రిటైర్డ్ ఇంజనీర్లు తనకు ‘‘బేవకూఫ్ సలహాలు’’ ఇస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు , వారిని ‘‘బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పు’’ అని వ్యాఖ్యానించారు…
రైతుల కళ్లల్లో ఆనందమే ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రజా ప్రభుత్వానికి నిజమైన ఆశీర్వాదమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ కాదని, పండుగ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.
అరేయ్ బుర్ర తక్కువోడా..’
మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన, ‘మేడిగడ్డలో నీళ్లు నిలిపితే అది కొట్టుకుపోయి భద్రాచలం రాముడే కొట్టుకుపోతాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘బుర్ర తక్కువోడా.. దుర్మార్గుడా’ వంటి పదజాలంతో విరుచుకుపడడంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
Big Story
మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కాళేశ్వరం సిస్టమ్‌లో అన్నీ నిక్షేపంగా ఉన్నాయి.. రేవంత్ బుర్ర తప్ప
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన శ్యామ్ ప్రసాద్‌రెడ్డిని పట్టుకుని చర్లపల్లి జైలులో వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ్యామ్ ప్రసాద్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసి తాను ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.కాళేశ్వరం వ్యవస్థలో రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, కాలువలు, మోటార్లు, సబ్‌స్టేషన్లు అన్నీ మంచిగానే ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం సిస్టమ్‌లో అన్నీ నిక్షేపంగా ఉన్నాయి.. ఒక్క రేవంత్‌రెడ్డి బుర్ర తప్ప’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Popular
Movies
సినీనటుడు మోహన్ బాబు పై ఫిర్యాదు..
సినీ నటుడు, రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం నాయకులు జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. గొర్రెలు...