సినీనటుడు మోహన్ బాబు పై ఫిర్యాదు..

సినీ నటుడు, రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం నాయకులు జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం మండల అధ్యక్షుడు బైకాని ఐలేష్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు మోహన్ బాబు గొర్ల కాపరి పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు.

సినీనటుడు మోహన్ బాబు పై ఫిర్యాదు..- news10.app

గొర్రెలు మేము కునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది అతను చూస్తున్నాడు ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నాడు అని అవమానకరంగా మాట్లాడినట్టు వారు తెలిపారు. గొల్ల కురుమల అగౌరవపరిచే ఉన్నట్లు మాట్లాడిన నటుడు మోహన్ బాబు పై చట్టరీత్య చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమల సంఘం మండల ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు సంగి వెంకన్న, పనికర నరేష్, సభ్యులు బెల్లీ ఉపేందర్, వేల్పుల మల్లేష్, చిలువేరు సందీప్, సలెంద్ర శీను, కుమారస్వామి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here