డ్వాక్రా మహిళల సొమ్ముకు రెక్కలు..?17 ఏళ్లుగా ఆ సీఏ పెత్తనం..!

మహిళల ఆర్థిక స్వావలంబనకు అండగా నిలవాల్సిన డ్వాక్రా సంఘంలోనే ‘కమీషన్’ దందా నడుస్తోందా..? బ్యాంకు నుంచి సభ్యురాలి పేరుతో రూ.లక్ష రుణం మంజూరైతే.. రూ.90 వేలు ఓ సీఏ ఖాతాలోకి మళ్లుతున్నాయా..? పని కావాలన్నా, రుణం రావాలన్నా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పాల్సిందేనా..? శాయంపేట మండలం తహరాపూర్‌లోని మహాలక్ష్మి డ్వాక్రా సంఘాల వ్యవహారంపై వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నాన్‌లోకల్ అయినా 17 ఏళ్లుగా సంఘాల్లో పెత్తనం చలాయిస్తూ.. ప్రశ్నించిన సభ్యులను గ్రూపు నుంచి తొలగిస్తామంటూ భయపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యే సొమ్మునూ వదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు డ్వాక్రా మహిళల ఖాతాల నుంచి నగదు ఎవరి ఖాతాల్లోకి వెళ్లింది..? బ్యాంకు లావాదేవీలపై సమగ్ర విచారణ జరిగితే ‘కమీషన్’ బాగోతం బయటపడుతుందా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.ఆ సి ఏ అవినీతి భాగోతం పై విశ్వసనీయ కథనం సాయంత్రం సంచికలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here