మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఏడుగురు వ్యక్తులు అదుపులోకి.. ₹40 వేల నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం

మడికొండ: పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మడికొండ గ్రామ శివారులో పోలీసులు దాడి నిర్వహించారు. మడికొండ ఎస్‌ఐ రాజబాబు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి- news10.app
పోలీసుల అదుపులో పేకాట రాయుళ్ళు
మడికొండ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి- news10.app
పట్టుబడ్డ నగదు, మొబైల్ ఫోన్లు

వారి వద్ద నుంచి రూ.40 వేల నగదుతో పాటు ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్లు మడికొండ సి ఐ పుల్యాల కిషన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here