మావోయిస్టు హిద్మా చిక్కాడ…?

వ్యూహాలు పన్ని దాడులు చేయడంలో సిద్ధహస్తుడు మావోయిస్టు పార్టీలో తన పదిహేడవ ఏటనే చేరి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం పీపుల్స్ గెరిల్లా ఆర్మి -1కి బాధ్యతలు వహిస్తున్న హిద్మా బీజాపూర్ ఎన్కౌంటర్ తో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారగా , బస్తర్ విడిచి తెలంగాణలో ప్రవేశించాడనే ప్రచారం జరుగుతోంది. దింతో ఇప్పుడు మావోయిస్టు హిద్మా ఎక్కడ…? అనే చర్చ మరింత జోరందుకుంది… మావోయిస్టు అగ్ర నేత అక్కరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కె మృతిపై ఆరాతీయడానికి వచ్చాడని కొందరు అంటుంటే… ఆర్కే మృతిపై పార్టీ ఎప్పుడో ప్రకటన విడుదల చేయగా ఇంకా హిద్మా తెలంగాణకు వచ్చి తెలుసుకునేది ఏముంటుందని కొందరు అంటున్నారు. మరోవైపు మావోయిస్టులను దెబ్బతీయడానికి వారిపై విష ప్రయోగం జరిగిందని ఇదే తరహాలో రోజురోజుకు ఆరోగ్యం క్షిణించి ఆర్కే మృతి చెందగా తనపై కూడా విష ప్రయోగం జరిగిందని ఈ విషయాన్ని ముందే పసిగట్టిన హిద్మా వైద్యం కోసం తిరుగుతున్నాడని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

మావోయిస్టు హిద్మా చిక్కాడ...?- news10.app

హిద్మా చిక్కాడా….?

మావోయిస్టు హిద్మా బస్తర్ అటవీ ప్రాంతాన్ని విడిచి తెలంగాణలో ప్రవేశించాడనే విషయం ప్రస్తుతం ప్రచారంలో ఉండగా… మరో ప్రచారం సైతం జోరుగా సాగుతోంది… అనారోగ్యంతో ఉన్న హీద్మా ను బీజాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మోస్ట్ వాంటెడ్ హిద్మా పోలీసులకు చిక్కాడని ప్రచారం జరుగుతున్నట్లు తెలిసింది. ఇది ఇలావుంటే మావోయిస్టు పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న హిద్మా పోలీసులకు చిక్కితే ఇప్పటివరకు మావోయిస్టులు స్పందించకుండా ఉండరని హాని తలపెట్టవద్దని ఎప్పుడో ప్రకటన చేసేవారని ఇంకొందరు అంటున్నారు… మావోయిస్టు నాయకత్వం తో టచ్ లో లేకుంటే స్థానిక కమిటీలు, పీ ఎల్ జి ఏ తప్పక స్పందించేది దింతో హిద్మా పోలీసుల అదుపులో ఉన్నది కూడా వాస్తవం కాదని తెలుస్తుంది…

గతంలో అనారోగ్యంతో ఉన్న 42 ఏళ్ల హిద్మా ఆయుర్వేద వైద్యం పై ఆధారపడ్డాడని ఇప్పుడు ఉన్న అత్యంత పోలీస్ నిర్బంధంలో ఇదే వైద్యం చేయించుకుంటున్నట్లు అందుకే పార్టీ తో టచ్ లో లేక పోవడం వల్ల, మరో వైపు ఆర్కే మరణం తో ఇలాంటి పుకార్లు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది… కాగా ఆర్కే మరణం తో మావోయిస్టు పార్టీలో విషాదం నెలకొనగా, మావోయిస్టు హిద్మా ఆరోగ్యం పై, అతను బస్తర్ ను విడిచాడని ఇలాంటి ప్రచారాలు చేస్తే మావోయిస్టు సానుభూతి పరులు, పార్టీలో కొనసాగుతున్న వారిలో ఆత్మస్థైర్యం తగ్గి లొంగుబాట్లు జరుగుతాయని ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయని మావోయిస్టు సానుభూతి పరులు అంటున్నారు… మొత్తానికి తెలంగాణాలో హిద్మా ఓ హాట్ టాపిక్ గా మారాడు… హిద్మా క్షేమం అని మావోయిస్టు పార్టీ ప్రకటించేవరకు ఈ ఊహాగానాలు ఇలాగే కొనసాగేలఉన్నాయి… ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా హిద్మా వచ్చాడనే ప్రచారంతో ఏజెన్సీ గ్రామాల్లో అలజడి మొదలయ్యింది… పోలీసుల కూంబింగ్,తనిఖీల తో ఏజెన్సీ వాసులు వణికి పోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here