అల్లు అర్జున్ తో దిశా పటాని స్టెప్పులు???

గతేడాది స్లో మోషన్ అంటూ సల్లు భాయి తో చిందులేసిన దిశా పటాని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కాలు కదపబోతున్నట్లు సమాచారం. లెక్కల మాస్టర్ సుకుమార్ తీస్తున్న తాజా చిత్రం పుష్పలో ఐటమ్ సాంగ్ కి దిశా ని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న పుష్పకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించబోతున్నారు. సంగీతపరంగా బన్నీ సుక్కు దేవి ఈ కాంబినేషన్ ఎప్పుడు సూపర్ హిట్టే. ఇక ఈ కాంబినేషన్ కి దిశా లాంటి కత్తిలాంటి డాన్సర్ తోడైతే ఇక అభిమానులకు పండగే.