ఫోన్ కొట్టు…. మ్యాంగో పట్టు

ఇప్పుడు ఫోన్ కొడితే చాలు మామిడి పండ్లు వచ్చి మీ ముంగిట వాలుతాయి.తీయనైన రుచిగల మామిడి పండ్లు తినాలనుకొనే వారికోసం రాష్ట్ర ఉద్యాన వన శాఖ I ఏర్పాటును చేసింది.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుండగా మామిడి పండ్ల రుచి నీ దూరం చేయకుండా కేవలం హైదరాబా ద్ వారికోసం ఫోన్ చేస్తే మామిడి పండ్లు తీసుకువచ్చి ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు ఉద్యాన వన శాఖ సంచాలకులు వెంకటరెడ్డి వెల్లడించారు.మెలురకం మామిడి పండ్లను సేకరించి వాటిని శాస్త్రీయంగా అట్టపెట్టెలో మగ్గపెట్టి అలాగే అందిస్తామని ఆయన చెప్పారు.5 కిలోల మామిడి పండ్ల బుట్టలో 12-15 వరకూ ఉంటాయని ఆయన వివరించారు. మీరు ఏం చెయ్యాలి అంటే మీకు ఎన్ని కిలోలు కావాలి అనే విషయాన్ని ఫోన్ చేసి చెప్పాలి. ఏ రకం కావాలో చెప్పాలి… రైతుల దగ్గర అందుబాటులో ఉండేవి మాత్రమే చెప్పాలి. కాయ సైజ్ ని బట్టి ధర ఉంటుంది. మామిడి పండ్లు కావాలి అనుకునే వాళ్ళు… కింద ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌ చేయాలని ఉద్యాన శాఖ పేర్కొంది.

79977 24925, 79977 24944 నంబర్లను వినియోగించాలని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఈ ఫోనులో అందుబాటులో ఉంటారని పేర్కొంది. గూగుల్‌ పే, ఫోన్‌పే ద్వారా నగదు చెల్లించాలనుకునేవారు.. 79977 24925 నంబరును వినియోగించాలని ప్రకటనలో వివరించింది. బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా చెల్లించాలనుకుంటే అకౌంట్‌ నంబరు 013910100083888, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఏఎన్‌డిబీ0000139, ఆంధ్రాబ్యాంక్‌, గగన్‌మహల్‌ శాఖలో జమ చెయ్యాల్సి ఉంటుంది అని పేర్కొంది. వినియోగదారులు పూర్తి చిరునామా, పిన్‌కోడ్‌ నంబరుతో పాటు ఫోను నంబరును సందేశం ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది.