సంస్కారవంతమైన పోలీస్

ఎదిగిన కొద్దీ ఒదగమని మన పెద్దలు చెప్తుంటారు. చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యమని చెప్తారు. ఇదే రీతిలో కొందరు ఎంతటి పదవిలో ఉన్న,కీలకమైన ఉద్యోగాల్లో ఉన్న సంస్కారాన్ని మాత్రం అసలే మరిచిపోరు. హోదా ఏదైనా సంస్కారానికి,ఆలోచనకే ప్రాధాన్యతను ఇస్తారు. ఈ కోవలో మొదటి వరుసలో నిలుస్తారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఇటీవల కమిషనర్ తీరు అందరి చేత ప్రశంసల్లో ముంచెత్తింది.తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా కొహెడలో నూతనంగా పండ్ల మార్కెట్ నెలకొల్పారు. కరోనా నేపధ్యంలో ఇక్కడి పనులు,రక్షణ చర్యల ను పర్యవేక్షించడానికి మహేష్ భగవత్ అక్కడకు వచ్చారు. మార్కెట్ లోపలికి వెళ్లే దారిలో మామిడికాయలు రాశులుగా పోసి ఉన్నాయి. సీపి తో పాటు వచ్చిన ఇతర అధికారులు, సిబ్బంది రాశులుగా పోసి ఉన్న మామిడి కాయలను తొక్కుతూ లోపలికి వెళ్లారు. సిపీ మహేష్ భగవత్ మాత్రం తాను ధరించిన బూట్లను విప్పి చేత పట్టుకొని మామిడి కాయల రాశులను దాటుతూ వెళ్లారు. ఆ దృశ్యం చూసిన అక్కడి స్థానికులు సీపీ సంస్కారానికి పిదా అయిపోయారు. ఎంతటి హోదాలో ఉన్న సంస్కారం అనేది ముఖ్యమని చర్చించుకున్నారు. హ్యాట్సాఫ్ సీపీ సార్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.