తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు…

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు…

13 మంది ఐఏఎస్‌లకు కొత్త పోస్టింగులు..

సీఎంకు సలహాదారుగా కె. రామకృష్ణారావు

గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా టి. వెంకన్న..

సీఎంవో, పలు కీలక శాఖల్లో మార్పులు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 13 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. పరిపాలనలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం, పలు ప్రధాన శాఖల్లో పోస్టింగులను ఖరారు చేసింది.ఇటీవల ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా బాధ్యతలు ముగించిన కె. రామకృష్ణారావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమించింది.ఎన్. శ్రీధర్ ను ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా, అహ్మద్ నదీమ్ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ (పొలిటికల్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. శైలజా రామయ్యర్ ను పర్యావరణ, అటవీ, శాస్త్ర-సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది.
రాహుల్ బోజ్జాను డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించగా, సబ్యసాచి ఘోష్కు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎం. రఘునందన్ రావుకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలు కేటాయించింది.అజిత్ రెడ్డిని ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా, పి. కాత్యాయని దేవిని హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ స్పెషల్ సెక్రటరీగా, కె. గంగాధర్ను ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది.అలాగే టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించింది. కె. విద్యాసాగర్కు టూరిజం డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ బదిలీలతో రాష్ట్ర పరిపాలనలో కీలక శాఖల్లో కొత్త అధికారుల నియామకం జరిగి, ప్రభుత్వ యంత్రాంగంలో సమర్థతను మరింత పెంచే దిశగా చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here