ఆ మండలం సర్కిల్ పరిధిలో సి ఐ సాబ్ ల్యాండ్ డీల్ హాట్ టాపిక్ గా మారింది… పది లక్షల డిమాండ్ చేసి లక్ష పుచ్చుకొని, ఆ తర్వాత ఎకరం భూమి తాను చెప్పిన వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయాలనీ సి ఐ డిమాండ్ చేసాడని ఆరోపణలు వస్తున్నాయి….అవునట ఆ సి ఐ భూ వివాదాన్ని పరిష్కరించే బదులు దానిని పెద్దగా చేసి తాను లబ్ది పొందాలని స్కెచ్ వేసుకున్నాడట … స్థానిక సర్పంచ్ తో కలిసి భూ సమస్య పరిష్కరిస్త ఎకరం భూమి ఇవ్వండి… నేను చెప్పిన వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి అని భూ యజమానికి హుకుం జారి చేసాడట… అందుకు భూ యజమాని ససేమిరా అనడంతో పోలిస్ కమిషనర్ ఆదేశాలను సైతం పక్కన పెట్టి తన సొంత పైత్యాన్ని జోడించి భూ యజమానిని ముప్పుతిప్పలు పెట్టడమే లక్ష్యంగా ఆ సి ఐ తన ఇష్టారాజ్యాంగ వ్యవహరించినట్లు భాధితుడు ఆరోపిస్తున్నాడు… ఓ రిటైర్డ్ ఏ సి పి మధ్యవర్తిగా తన వద్ద నుంచి లక్ష రూపాయలు తీసుకున్న ఆ సి ఐ సమస్యను పరిష్కరించకుండ తన భూమిని కబ్జా చేసిన వారిని తన పైకి ఉసి గొల్పుతు “జనం అంటే అలాగే అగ్రేసీవ్”… గా ఉంటారు అని ఉచిత సలహాలు ఇస్తూ భూ సమస్యను మరింత జటిలం చేయాలని చూస్తున్నాడట… దీనికి సంబందించి భాధితుడి వద్ద అన్ని ఆధారాలు ఉన్న ఎలాంటి భయం లేకుండా సదరు సి ఐ తన ఇష్టా రీతిన వ్యవహారిస్తున్నాడు అంటే ఈ భూ వివాదం వెనకాల అసలు ఉన్నది ఎవరు…? అనే అనుమానం కలుగుతుంది… పోలీసు ఉన్నతాధికారి మాటలు సైతం పెడ చెవిన పెడుతూ సమస్య పరిష్కారం కాకుండా సి ఐ అడ్డు తగులుతున్నాడు అంటే దీని వెనకాల అసలు మతలబు ఏంటి…? సమస్య పరిష్కారం కోసం పది లక్షలు డిమాండ్ చేసి లక్ష రూపాయలు పుచ్చుకొని తిరిగి తాను చెప్పిన వాళ్లకు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయమని ఆ సి ఐ అంతగా బరితెగించడం ఏంటి…?
ఇంతకీ ఎవరా సి ఐ? ఆ ల్యాండ్ డీల్ ఏంటి…? పోలీస్ కమిషనర్ ఆదేశాలు భేఖాతర్ చేస్తూ భూ యజమానిని ఎందుకు తిప్పలు పెడుతున్నాడు…?
హన్మకొండ జిల్లా లోని ఓ సర్కిల్ పరిధిలో “ఆ సి ఐ సాబ్ ల్యాండ్ డీల్” పై న్యూస్ 10 విశ్వసనీయ సంచలన కథనం సాయంత్రం సంచికలో….



