ఇప్పటికి అదే తీరు…
అధికారులంటే లెక్కలేని తనం…
కలెక్టర్ ఆదేశాలపై సైతం ఎలాంటి పట్టింపు లేని వైనం..
బకాయి ఉన్న లేదని బుకాయించే తత్వం…
అంతా నాకు తెలుసు నేను చూసుకుంటా అని పోజులు కొట్టే అతి విశ్వాసం…వెరసి బకాయి మిల్లర్…
తన అక్రమాలపై ఇతరులు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఇంత ఎత్తు ఎగిరి నోటికొచ్చినట్లు మాట్లాడే ఆ బకాయి మిల్లర్…తాను బకాయి ఉన్న మాట మరిచి ఏమాత్రం బకాయి లేనంటూ బుకాయిస్తూ అధికారులను బురిడీ కొట్టించడం తనకు చాలా తేలిక అంతా నేను చూసుకుంట అంటూ మిగతా మిల్లర్లకు అభయ హస్తం ఇస్తున్నట్లు తెలిసింది.. తాను తప్పు చేస్తూ అది అందరికీ అంటగట్టే ప్రయత్నం చేసే అతడు…తనకు ఉన్న రెండు మిల్లులు తన సతీమణి పేరు మీద ఉన్న అసోసియేషన్ లో పాగా వేసి “మంత్రి నా చుట్టమే ఆయన సహకారం ఉందంటూ”.. చెప్పుకొనే మరో అసోసియేషన్ నాయకుడి సహకారంతో చక్రం తిప్పుతున్న ఆ మిల్లర్ కాని మిల్లర్ ఇతరులను విమర్శించడంలో…నీళ్లు తాగినంత సులువుగా అపవాదులు అంటగట్టడంలో ముందుంటాడని మిల్లర్లల్లో ప్రచారం సాగుతోంది…
బట్టి క్యాంపు నుంచి ఫోనొచ్చింది…
తన మాట వినని మిల్లర్లను ఎదో రకంగా ఇబ్బందులు పెట్టె ఈ మిల్లర్ తాను బకాయి ఉన్న విషయం మరిచి ఓ అధికారి సహాకారంతో ఇతర మిల్లుల కంటే ముందుగానే తన రెండు మిల్లులకు ధాన్యం కేటాయించుకొని అత్యుత్సాహం ప్రదర్శిస్తే కలెక్టర్ ఆదేశాలతో ఆ ధాన్యం వేరే మిల్లులకు తరలించిన…తిరిగి ఖమ్మం జిల్లా నుంచి ధాన్యం కేటాయించుకున్నాడు…తనకు చెందిన వీరభద్ర, శ్రీశైలం మల్లన్న మిల్లులకు ధాన్యం కేటాయించుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం నుంచే ఫోన్ వచ్చిందని, తనకు తాను ఎక్కువగా చెప్పుకునే ప్రయత్నం చేసాడు ఆ మిల్లర్…ఖమ్మం జిల్లాకు చెందిన ధాన్యం కనుక నీ మిల్లుకే కేటాయిస్తామని బట్టి క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ చేసి మరీ తనను బలవంతం చేశారని పదేపదే తన గొప్పతనం గూర్చి న్యూస్10 ప్రతినిధి ఎదుట ఆ మిల్లర్ ఆయన లేని గొప్పతనం గూర్చి ఆయనే వల్లె వేసుకున్నాడు… తాను అన్ని కోట్ల రూపాయల ధాన్యం సర్కార్ కు బకాయి లేనని చెపుతూనే అన్ని కోట్లు ఎక్కడివి…? అంటూ ఓ సెటైరికల్ నవ్వు నవ్వి తన బకాయి గూర్చి అసలు అధికారుల రికార్డు ల్లోనే తప్పులు ఉన్నాయి అన్నట్లు కామెంట్ చేసాడు…బకాయిల విషయంలో న్యూస్10 సోర్స్ కు అధికారుల వద్ద నుంచి అందిన సమాచారం ప్రకారమే 28 కోట్ల పైనా ఆ మిల్లర్ కాని మిల్లర్ బకాయి ఉన్నాడని కథనంలో పేర్కొంటే అది శుద్ధ తప్పు అని తప్పుపట్టే ప్రయత్నం చేసినా అతగాడు అసలు మిల్లుల నుంచి కలెక్టర్ ఆదేశాలతో ధాన్యం అధికారులు ఎందుకు తరలించారో సమాధానం మాత్రం చెప్పలేదు… అసోసియేషన్ నాయకుడిగా చెలామణి అవుతూ ఇతర మిల్లర్లను అకారణంగా ఇబ్బందులకు గురి చేస్తూ…5వేల 5 వందల స్టిక్కర్ దోపిడీ ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పలేదు.. కానీ తాను 5వేల 5 వందల స్టిక్కర్ వసూళ్ల గుట్టు విప్పితే అధికారుల కుర్చీలు కదులుతాయి అని మాత్రం కామేంట్ చేసాడు..
మీడియా మొత్తం తెలుసు…!
మీడియా మొత్తం తెలుసు ప్రతి ఒక్కరికి ఈ పదం ఇటీవల ఓ ఫ్యాషన్ గా మారింది..అవినీతి దందా చేయడం ఇదేంటని ప్రశ్నిస్తే తనకు మీడియా మొత్తం తెలుసని ఓ నలుగురైదుగురి పేర్లు చెప్పడం.. సరిగ్గా ఇలాగే ఆ అసోసియేషన్ నాయకుడి ఆ డైలాగ్ కొట్టి తాను చేస్తున్న అక్రమాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసాడు….మీడియా వ్యక్తులు తెలిస్తే అక్రమాలు,దందాలు చేస్తూ కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బకాయి పడు అని చెప్తారా…?ఏమో మరి ఆ మిల్లర్ కే తెలియాలి…తాను బకాయి ఉన్నాడని స్పష్టంగా తెలుస్తున్న విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం అసలు బకాయి లేని మిల్లుల యజమానులను ఇదిగో బకాయి ఉన్నాడని అసోసియేషన్ నాయకుడి హోదాలో ఉన్న ఇతగాడే ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది… “తా చెడ్డ కోతి వనమెల్ల చెరచిందట” అన్నట్లు అసోసియేషన్ నాయకుడి గా చెలామణి అవుతున్న అతను ఇతర మిల్లర్లపై బకాయి లేకున్నా బకాయి ఉన్నాడు అంటూ ప్రచారం చేస్తూ వారిని మానసికంగా వేధిస్తూ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం… కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏ మిల్లర్ ఎంత బకాయి ఉన్నాడు సి ఎం ఆర్ పెట్టాడా లేదా..?అనే వివరాలు స్పష్టంగా సివిల్ సప్లయీస్ అధికారుల వద్ద ఉన్న మరి ఈ అసోసియేషన్ నాయకుడు తన సభ్యులపైనే ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నాడో ఆయనకే తెలియాలి.. తనపై వార్త కథనాలు వస్తున్నాయి కనుక ఇతర మిల్లర్లు సైతం ఎందుకు బదనాం కాకూడదనే ఉద్దేశ్యం తోనే ఈ ప్రచారానికి తెరతీసినట్లు తెలుస్తుంది…
5వేల 5 వందల గుట్టు విప్పుతా…
అధికారుల కుర్చీలు కదులుతాయి…
అసోసియేషన్ నాయకుడి పరోక్ష బెదిరింపులు….
న్యూస్10 బ్లాస్టింగ్… మరో సంచికలో…



