రైతులను మోసం చేశారు.

గత ఏడాది ఓడిసిఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించిన నిర్వాహకులు రైతుల ధాన్యం బస్తాలను తరలించిన రవాణా చార్జీలను నేటికీ చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండలంలోని మైలారం గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ 2025 ఖరీఫ్ రబీ సీజన్లలో రైతులు ఆరువాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓడిసిఎంఎస్ కొనుగోలు కేంద్రానికి 290 మంది రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఒక్కో రైతు చొప్పున సుమారుగా 100 నుండి 200 బస్తాల వరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే కేంద్ర నిర్వాహకులు రైతులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలతో పాటు గన్నిసంచుల డబ్బులను చెల్లించకుండా కాంట్రాక్టర్ తో కుమ్మక్కై లక్షలాది రూపాయలను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించిన నిర్వాహకులను గ్రామ సభలో నిలదీయడంతో దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు స్పందించకపోవడంతో గత వారం గ్రీవెన్స్ సెల్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని అన్నారు.ఏడాది గడిచినా రైతులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు,గన్ని సంచుల డబ్బులను చెల్లించకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన రవాణా చార్జీలు, గన్ని సంచులు డబ్బులు చెల్లించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల కిరణ్ నూనె రాజయ్య అందమైన రమేష్ సదయ్య నూనె కిరణ్ శ్రీనివాస్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here