ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్‌ను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు

ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రావుపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశాలు
దర్యాప్తు నివేదిక వచ్చే వరకు ఏఆర్‌కు అటాచ్ చేసిన పోలీసు కమిషనర్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రావును ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్)కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రావుపై భూ వివాదం పరిష్కారం విషయం లో పలు ఆరోపణలు రావడంతో వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయనను విధుల నుంచి తప్పించి ఏఆర్‌కు అటాచ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అధికారులు ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించి సమగ్ర నివేదికను పోలీస్ కమిషనర్‌కు సమర్పించనున్నారు. నివేదిక ఆధారంగా తదుపరి పరిపాలనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ పరిణామం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది.




