శాంతి భద్రతలు, ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక ఫోకస్: వరంగల్ సీపీ ఎన్. శ్వేతారెడ్డి
వరంగల్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీసింగ్‌ను అమలు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.నగరంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై రాజీ లేకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, షీ టీమ్స్, పెట్రోలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి భయం లేకుండా జీవించే వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.అలాగే ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, సైబర్ నేరాల నివారణ, యువతలో చట్టాలపై అవగాహన పెంపు, కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ప్రజల సహకారంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని, సమస్యలు ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సీపీ ఎన్. శ్వేతారెడ్డి విజ్ఞప్తి చేశారు.



