హన్మకొండలో రెచ్చిపోతున్న….. ఓ భూకబ్జాల బాబు

బాబు రా…(వు) అంటూ రాచ మర్యాదలు చేస్తున్న ఓ సిఐ….?
కిరాయి మనుషులతో భూ కబ్జాలు
రాత్రికిరాత్రే గోడకడతారు, షెడ్డే స్తారు మనుషులను కాపలా పెడతారు
ఇదేంటని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటారు
బాధితులకంటే ముందే స్టేషన్ కు వెళ్లి సిఐ సారును ప్రసన్నం చేసుకుంటారు
కబ్జాల బాబు ఆగడాలతో భయపడిపోతున్న ప్లాట్ల యజమానులు

ఇప్పటికే ఇతగాడి బారిన పడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న కొంతమంది భాదితులు

హన్మకొండలో అతగాడి ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోయింది…ఖాళీ జాగా కనపడితే చాలు కబ్జా చేస్తూ ఇది నా భూమి అంటూ అసలు భూయజమానులను బెదిరిస్తూ అక్రమంగా భూములను తన వశం చేసుకుంటున్నాడు….పైసా పైసా పొగుచేసుకొని ఇంటి స్థలం కొనుక్కున్న వారి ప్లాట్లల్లో పాగా వేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నాడట. ఇప్పటివరకు ఇతగాడు చాలామంది భూములను కబ్జా చేసి ఇటీవలే మూడు కోట్ల రూపాయలతో ఓ ఇంద్రభవనాన్ని నిర్మించుకున్నాడట. హన్మకొండ ములుగురోడ్డు మొదలుకొని ఆరేపల్లి వరకు ఇతడి కబ్జాల బారిన పడిన వారు అధికసంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం.

హన్మకొండలో రెచ్చిపోతున్న..... ఓ భూకబ్జాల బాబు- news10.app

ఎవరీ కబ్జాల బాబు….?

ఓ శాఖ ప్రభుత్వ ఉద్యోగిగా కొలువు వెలగబెట్టి సస్పెండ్ అయి ప్రస్తుతం కబ్జాలే పనిగా పెట్టుకొని హన్మకొండ ములుగురోడ్డు మొదలుకొని ఆరేపల్లి వరకు ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ వాలి పోతూ నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి వాటి ద్వారా అసలు భూయజమానులను బయపెడుతూ అవసరమైతే వచ్చినకాడికి దండుకొని భారీగానే వెనకేసుకోవడం ఇతడు పనిగా పెట్టుకున్నట్లు తెలిసింది. కొంతమంది యువకులను చేరదీసి పెద్దమ్మ గడ్డ ప్రాంతంలో ఓ షెడ్డు నిర్మించి అందులో వీరిని ఉంచి కేవలం ఖాళీజాగలు కబ్జా చేయడం కోసమే వీరిని వాడుకుంటూ బీరు,బిర్యానీ అడపా దడపా కొన్ని డబ్బులు ఇస్తూ వీరిచేత భూయజమానులను బెదిరిస్తున్నట్లు తెలిసింది.ప్రభుత్వ ఉద్యోగులు, ఏ ఆసరా లేనివాళ్ళు, విదేశాల్లో ఉండే వారి భూములను కబ్జా చేసే ఈ కబ్జా బాబు ఇటీవల ములుగు రోడ్ ప్రాంతంలో, కాకతీయ కెనాల్ దాటినా తర్వాత ఉన్న భూముల్లో ప్రహారి గోడ పెట్టుకొని ఉన్న వాటిని కూలదోసి ఆక్రమించుకొనే ప్రయత్నం చేశాడట…భాదితులు వెళ్లి ప్రశ్నిస్తే మీరు ఎక్కడికి వెళ్లినా నన్ను ఏంచేయలేరు స్థలం వదులుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడట.

పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు…?

భూకబ్జాలతో రెచ్చిపోతు అమాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్న కబ్జా బాబు హన్మకొండలోని ఓ పోలీస్ స్టేషన్ లో అడుగు పెడితే చాలు కానీ పని అంటూ ఉండదట. ఆ స్టేషన్ సిఐ ఇతనికి అన్ని రకాలుగా సహకరిస్తాడాని భాదితులు తమ భూమి కబ్జా గోడును విన్నవించుకుంటే సదరు సిఐ ఎదో ఒకటి చేసి అతనితో సెటిల్ చేసుకోండని ఉచిత సలహా ఇస్తాడాట… ఈ సిఐ అండ చూసుకొని ఆ కబ్జా బాబు మీరు స్టేషన్ లో పిర్యాదు చేసిన ఎం నడవదని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాడట.. భాదితులు స్టేషన్ కు వెల్లకముందే తానే ముందుగా ఫోన్ చేసి సిఐ కి అంతా చెప్తాడట… అది విన్న సిఐ భాదితులు పిర్యాదు చేయడానికి వెళ్ళగానే అంటాతెలిసినట్లు గానే మాట్లాడి భాదితులనే నాలుగు చివాట్లు పెట్టి అవసరమైతే ఎలా కాంప్రమైజ్ కావాలో చెప్పి పంపుతాడాని కొంతమంది భాదితులు తెలిపారు… ఇటీవల కోట్ల రూపాయలు విలువచేసే ఓ భూమిని కబ్జా బాబు అక్రమంగా ఆక్రమించి ప్లాట్లు అమ్మితే ఈ సిఐ తన శాయశక్తులా సహకరించి భారీగానే లబ్ది పొందినట్లు విశ్వసనీయ సమాచారం. ములుగు రోడ్డు నుంచి ఆరేపల్లి వరకు కబ్జాల తతంగం నడిపిస్తున్న కబ్జాల బాబు ఈ సిఐ గారిని ప్రసన్నం చేసుకోవడంలో ముందు వరుసలో ఉంటాడట.. మొత్తానికి ఇతగాడి ఆగడాలు పెరగడానికి, కబ్జాలతో రెచ్చిపోవడానికి కేవలం సిఐ అందిస్తున్న సహకారమేనని భాదితులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల మౌనం ఎందుకు…?

ఓ వైపు కబ్జారాయుళ్ల పై ఉక్కు పాదం మోపుతాం ,పిడీ యాక్ట్ నమోదు చేస్తాం అంటూ వరంగల్ పోలీస్ కమిషనర్ చెప్తున్న… హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కబ్జా బాబు ఆగడాలు శృతి మించి పోతున్న పోలీసులు మాత్రం తమకేం పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. కబ్జా బాబు తమ స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించాడని, ప్రహారి కూల గొట్టాడని,తమను బెదిరింపులకు గురిచేస్తున్నాడని భాదితులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన చర్యలు మాత్రం ఏమి లేక పోగా కాంప్రమైజ్ కావాలి పోలీసులు చెపుతున్నారు తప్ప సమస్య మాత్రం పరిష్కరించడం లేదనే ఆరోపణలు బాగానే వినవస్తున్నాయి. సంబంధం లేని భూముల్లో ప్రవేశించి కావాలనే అక్కడ నిర్మాణం చేసి అయితే భూమి లేదంటే కాంప్రమైజ్ లో భూమి విలువలో యాభై శాతం డబ్బులు దండుకొని బహిరంగంగానే సెటిల్మెంట్ చేస్తున్న పోలీసులు మౌనం వహించడం వెనకాల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా పోలీసులు ఈ కబ్జా బాబు ఆగడాలకు అడ్డుకట్ట వేసి భాదితులకు న్యాయం చేస్తారా…? వేచిచూడాలి.