అంతా మా ఇష్టం

హన్మకొండ జిల్లా సివిల్ సప్లయీస్ శాఖ లో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది…ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే లేదా ఉన్నతాధికారులే అలా చేయండని చెప్తున్నారో తెలియదు కాని ఎన్ని ఆరోపణలు వచ్చిన,భారీ స్కామ్ లు బయటపడిన వారి బరితెగింపు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు…వారికి తోచింది చేస్తారు…డబ్బులు వసూళ్లు చేసి మరీ డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ధాన్యం కేటాయిస్తారు…ససేమిరా అన్న వారికి గింజ ధాన్యం కూడా కేటాయించరు… అంతేకాదు ఈ శాఖలో ఒకరి పనిని ఇంకొకరు చేస్తారు ..ఒకరి విధుల్లో ఇంకొక్కరు జోక్యం చేసుకొని పెత్తనం చేస్తారు…సరిగ్గా ఇలాగే జిల్లా పౌరసరఫరాల శాఖలో ఓ సీనియర్ అసిస్టెంట్ మేడం సూపరింటెండెంట్ బాధ్యతలు నిర్వహిస్తూ…ట్యాగింగ్ లో జోక్యం చేసుకొని తనను ప్రసన్నం చేసుకుంటే పెద్ద సారు వద్దకు ఫైల్ పంపి గంటల్లో ఫైల్ అప్రూవల్ చేయిస్తుంది…ప్రసన్నం చేసుకొని ఇతర మిల్లర్లను రేపు రా మాపు రా అంటూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటు అవసరమైతే కొర్రీలు పెడుతూ చుక్కలు చూపెడుతున్నట్లు మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు…. అసలు ట్యాగింగ్ చేసే పని సూపరింటెండెంట్ ది ఐయిన పెద్ద సారు నాకు ఈ పని అప్పగించాడు అంటూ ఈ సీనియర్ అసిస్టెంట్ మేడం చేతివాటం చూపుతూ…మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు,మీడియా ఎవరు అడిగిన ఇప్పటివరకు తాను ట్యాగింగ్ చేసిన మిల్లర్ల వివరాలు చెప్పకుండా ఇదేంటని…?అడిగితే నో ఆన్సర్ అంటూ సమాధానం దాటవేస్తుంది…మరోసారి ప్రశ్నిస్తే వెళ్లి అదనపు కలెక్టర్ ను అడగండి సార్ చెపితేనే నేను ఈ ట్యాగింగ్ పని చేస్తున్నా…అంటూ సమాధానం ఇస్తుంది…సివిల్ సప్లైఈస్ లో తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఈ సీనియర్ అసిస్టెంట్ ను ఎవరు అడ్డుకోలేక పోతున్నారు అంటే ఆ ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగానే ఉన్నట్లు అర్థం అవుతుంది….

బీజీ ని మించి కేటాయింపులు ఎందుకో…?


హన్మకొండ జిల్లాలోని ఓ 15 మంది మిల్లర్లకు పౌరసరఫరాల అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా మిల్లర్లు ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీ ని మించి ధాన్యం కేటాయించారు… కేటాయించాల్సిన దానికంటే రెట్టింపు స్థాయిలో ధాన్యం కేటాయించారు…ఈ 15 మందిలో మిల్లర్స్ అసోసియేషన్ కు చెందిన ఇద్దరు నాయకుల మిల్లులకు సైతం అధికారులు బిజీ ని మించి ధాన్యం కేటాయించారు…అసోసియేషన్ నాయకుడికి చెందిన శ్రీనిధి ఇండస్ట్రీస్ కు అధికారులు ఇలాగే బిజి ని మించి ధాన్యం కేటాయించి తమ భక్తిని చాటినట్లే వ్యవహరించారు…కాగ బీ జీ ని మించి ధాన్యం ఎలా కేటాయించారు …?ఆ 15 మిల్లుల వివరాలు ఇవ్వండని న్యూస్10 ప్రతినిధి సీనియర్ అసిస్టెంట్ ను అడిగితే నో ఆన్సర్ అంటూ సమాధానం ఇచ్చింది…ఇక బీ జీ సమర్పించిన కొన్ని మిల్లులకు ధాన్యం కేటాయించకుండా అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…ఈ మిల్లర్లు కార్యాలయం చుట్టూ ధాన్యం కేటాయింపు కోసం ఎంతగా తిరిగిన అధికారులు ఏమాత్రం కరుణ చూపడం లేదట…ఇదిలాఉంటే జిల్లాలో కొంతమంది మిల్లర్లు ఏమాత్రం బీజీ ఇవ్వకున్న వారికి ధాన్యం కేటాయించి గంటల్లో ట్యాగింగ్ చేసినట్లు తెలుస్తోంది…ఇందులో మర్మం ఏంటని…?ఆరా తీస్తే అధికారులను ఆ మిల్లర్లు ప్రసన్నం చేసుకోకపోవడమేనని సమాధానం మిల్లర్ల వద్ద నుంచి వినిపిస్తుంది…

డి ఎస్ ఓ ఆసహనం…

ధాన్యం ట్యాగింగ్ విషయంలో న్యూస్10 ప్రతినిధి వివరణ కోరితే,ఆ 15 మిల్లుల వివరాలు అడిగితే డి ఎస్ ఓ చిర్రుబుర్రులాడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు… పౌర సరఫరాల శాఖ తన సొంతం ఐయినట్లు ఎదో దయతలచి ఉద్యోగం చేస్తున్నట్లు మీరు చెప్పినట్లు చేయాలా…?వివరణ కోరితే సమాధానం ఇవ్వాల…?అంటూ వింత ప్రశ్నలు సంధిస్తున్నారు…అంతా ఉన్నతాధికారికే తెలుసు అంటూ చేతులు దులిపేస్తున్నారు….

కలెక్టర్ దృష్టిలో లేదా…?

హన్మకొండ జిల్లా సివిల్ సప్లయీస్ లో కేటాయింపులు, ట్యాగింగ్ ల విషయంలో ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడం లేదా…?అధికారులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తూ వారు చేస్తున్న తప్పులు కలెక్టర్ దృష్టికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారా…?అంటే అవుననే సమాధనమే వస్తుంది…ఈ శాఖ లో ఉన్న అధికారులు వారి మధ్య ఓ అవగాహన చేసుకొని తమకు తోచినట్లు కేటాయింపులు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…కలెక్టర్ దృష్టి సారించి వీరిని గాడిలో పెడితే అవినీతికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది…వీరి విషయంలో కలెక్టర్ ఎం నిర్ణయం తీసుకుంటారో చూడాలి…

సూపరింటెండెంట్ అవతారం ఎత్తిన సీనియర్ అసిస్టెంట్..!

ట్యాగింగ్ లో ఆ మేడమ్ కీలకం…మేడం ఎంత చెపితే అంత
గంటల్లో ట్యాగింగ్ ఫైల్ అప్రూవల్…?

మరో సంచికలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here