కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలన్న ఇంజనీర్లపై సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
‘‘బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారు.. వీళ్లను బొక్కలో వేయకపోవడమే నేను చేసిన తప్పు’’ అంటూ ఫైర్
రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్రెడ్డిపైనా ఆగ్రహం.. ‘‘చర్లపల్లి జైలుకు పంపితే తెలిసేది’’ అంటూ వ్యాఖ్య
ఇరిగేషన్ ఇంజనీర్లు, వాతావరణ శాఖ అధికారులకు ‘‘బెల్ట్ ట్రీట్మెంట్’’ ఇవ్వాలంటూ ఘాటు కామెంట్స్
కరువు, పంటలపై జర్నలిస్టు ప్రశ్నకు సీఎం చేసిన వ్యాఖ్యలపైనా చర్చ
ముఖ్యమంత్రి భాషపై రాజకీయ దుమారం రేగే అవకాశం
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలని ప్రభుత్వానికి లేఖ రాసిన రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు..రిటైర్డ్ ఇంజనీర్లు తనకు ‘‘బేవకూఫ్ సలహాలు’’ ఇస్తున్నారంటూ సీఎం మండిపడ్డారు , వారిని ‘‘బొక్కలో వేయకపోవడమే తాను చేసిన తప్పు’’ అని వ్యాఖ్యానించారు…
కన్నెపల్లి వద్ద అందుబాటులో ఉన్న నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి సహా గోదావరి బేసిన్‌లోని జలాశయాలకు తరలించే అవకాశాలను పరిశీలించాలని రిటైర్డ్ ఇంజనీర్లు సూచించారు…
అయితే ఈ సూచనలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు . ‘‘రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి నాకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నారు. వీళ్లను బొక్కలో వేయకపోవడమే నేను చేసిన తప్పు’’ అంటూ వ్యాఖ్యానించారు…కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వానికి లేఖ రాసిన రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్రెడ్డిపైనా సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు…
‘‘నిన్ను చర్లపల్లి జైలుకు పంపితే తెలిసేది’’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు…
రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లతో పాటు ‘‘సూపర్ ఎల్‌నినో’’ పరిస్థితులపై అంచనాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు..రిటైర్డ్ ఇంజనీర్లు, వాతావరణ శాఖ అధికారులకు ‘‘బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి’’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు . నీటి లభ్యత, వర్షాభావ పరిస్థితులు, కన్నెపల్లి పంపుల నిర్వహణపై జరుగుతున్న రాజకీయ వివాదం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి…కరువు పరిస్థితులు వస్తే రైతుల పంటలకు నీరు ఎలా అందిస్తారని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా
‘‘ఏముంది.. వాళ్లను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది’’ అంటూ సీఎం వ్యాఖ్యానించారు..
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయే అవకాశంపై సాంకేతిక అనుభవం ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు ప్రభుత్వానికి లేఖ రాయడం తప్పా? వారి సూచనల్లో లోపాలు ఉంటే ప్రభుత్వం సాంకేతిక ఆధారాలతో సమాధానం చెప్పాల్సింది పోయి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సమంజసమా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.రిటైర్డ్ ఇంజనీర్ల సూచనలు ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తే అందుకు సంబంధించిన సాంకేతిక కారణాలను ప్రజల ముందు ఉంచాలని, జలవనరుల అంశాన్ని రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యల స్థాయికి తీసుకెళ్లకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కన్నెపల్లి పంపుల అంశంపై ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గోదావరిలో నీరు అందుబాటులో ఉన్నా రాజకీయ కక్షతో ప్రభుత్వం ఎత్తిపోతలు చేపట్టడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, మేడిగడ్డ పరిస్థితిపై కాంగ్రెస్ నేతలు గత ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు.
ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఇంజనీర్లపై సీఎం చేసినట్లు ప్రచారంలో ఉన్న ఘాటు వ్యాఖ్యలు కొత్త రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది.



